తెలంగాణలో భారీగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ప్రముఖ ఆలయాలు పాక్షిక లాక్ డౌన్ ను పాటిస్తున్నాయి. కొన్ని స్వచ్చంధంగా మూసివేస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని ప్రముఖ క్షేత్రమైన యాదగిరి గుట్ట లో పదిరోజుల పాటు ప్రభుత్వం లాక్ డౌన్ విధించనుంది. ఈ మేరకు యాదగిరిగుట్టలో నేటి నుంచి 10 రోజుల పాటు మధ్యాహ్నం 2 గంటల నుంచి లాక్ డౌన్ ఉంటుంది. స్వచ్ఛందంగా షాపుల మూసివేతకు షాప్ ఓనర్లు నిర్ణయం తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధ సూచించారు. ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలని ఆంక్షలు విధించారు.
వల్లభనేని వంశీ పీఏ సహా టీమ్ మొత్తం అస్సాం… గన్నవరంలో కొత్త ట్విస్ట్….!!
వల్లభనేని వంశీ మోహన్... టీడీపీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన యువ నేతగా, గన్నవరం...