ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ పరిధి కర్సువాలో కల్తీ మద్యం తాగి 11 మంది మృతి చెందారు.మరో ఐదుగురు అస్వస్థతకు గురికాగా వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ఒకరికే చెందిన రెండు దుకాణాల్లో వీరందరూ మద్యం తాగినట్లు గుర్తించిన అధికారులు ఆ దుకాణాలను సీజ్ చేశారు.కల్తీ మద్యం తాగి ఇద్దరు మృతి చెందినట్లు తొలుత లోధా పోలీసులకు ఫిర్యాదు అందగా ఆ ప్రాంతానికి చేరుకుని విచారణ చేశారు.దీంతో కర్సువాతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన 11 మంది మృతి చెందినట్లు తేలింది.లోధా డీఐజీ దీపక్ కుమార్,ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డి శర్మలు ఈ సంఘటనపై విచారణ చేస్తున్నారు.
Must Read ;- జగన్‌కు మద్యంపై ఆదాయంపై ఉన్న ఆరాటం ప్రజల ఆరోగ్యంపై లేదు:లోకేష్











