ఓట్ల లెక్కింపులో అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తుంటాయి. అలాంటి సంఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఓట్ల లెక్కింపులో వెలుగు చూసింది. కర్నూల్ జిల్లా నంద్యాల 29 వ మున్సిపాలిటీ వార్డ్‌లో ఓట్ల లెక్కింపు సమయంలో బాక్సుల్లో కొన్ని స్లిప్పులు కనిపించాయి. ఆ స్లిప్పులు చదివిన ఓట్ల లెక్కింపు అధికారులు ఆశ్యర్యపోయరు. కొంతమందికి నవ్వును కూడా తెప్పించింది. ఇంతకీ ఆ స్లిప్పుల్లో ఏముందంటే…
కొత్త బ్రాండ్స్ తొలగించకపోతే ఇదే చివరి ఓటు..
‘‘గౌరవనీయులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అన్న గారికి తాగుబోతుల విన్నపం ఏమనగా, కొత్త బ్రాండ్స్‌ను తొలగించి పాత బ్రాండ్స్ అమ్మవలెను అని వ్యాఖ్యానించారు. లేకపోతే మాయొక్క చివరి ఓటు కాగలదు. మద్యం అమ్మకాల్లో కొత్త బ్రాండ్లు అయిన సుప్రీం, దారు , హైదరాబాద్, జంబో తదితరాలను తొలగించి, పాత బ్రాండ్లు అయిన రాయల్ స్టాగ్, ఇంపీరియల్ బ్లూ, బ్లాక్ డాగ్ వంటి రకాల అమ్మకాలు జరపాలని ’’ అని విన్నవించుకున్నారు. ఆ స్లిప్పులతో పాటు ‘విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు’ అనే నినాదాలతోపాటు ‘జై అమరావతి‘ అంటూ కొన్ని స్లిప్పులు బాక్సుల్లో కనిపించినట్లు ఓట్ల లెక్కింపు అధికారులు తెలిపారు. అయితే తాగుబోతుల రాసిన స్లిప్పులు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
Must Read ;- జగన్.. మద్యం పై మాట తప్పలే.. కాని తిప్పారు..











