ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా సంబంధిత వార్తలే.ఏ నోట విన్నా..కరోనా విలయాలే.మానవాళిపై కరోనా సాగిస్తున్న మరణ మృదంగంపై విశ్లేషణలు. కరోనా విరుగుడుకు ఓ వైపు ఔషధాలు వాడుతూనే.. మరోవైపు జీవన శైలిని మార్చుకునే పనిలో మానవాళి నిమగ్నమైపోయింది.ఇప్పటికే లక్షలాది మందిని పొట్టనబెట్టుకున్నఈ ప్రాణాంతక వైరస్ నిష్క్రమణ ఎప్పుడన్న విషయంపై యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోందనే చెప్పాలి.ఇలాంటి తరహా వార్తలకు జీవం పోసేలా ఇప్పుడో కొత్త విషయం ఎంట్రీ ఇచ్చింది.అదే… భారత రక్షణ, పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) రూపొందించిన 2-డీజీ ఔషధం ఎంట్రీ. మాస్ ప్రొడక్షన్ ఇప్పటికే మొదలు కాగా.. తొలి విడతలో ఓ 10 వేల డోసులు శుక్రవారం విడుదల కానున్నాయి.ఈ ఔషధం ముందు కరోనా వైరస్ చేష్టలుడిగి నిష్క్రమించక తప్పదన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
కరోనా వైరస్‌ను బురిడి కొట్టించి..
టాలీవుడ్‌లో పాతతరం సూపర్ స్టార్ కృష్ణ హీరోగా తెలుగు ప్రజలను ఉర్రూతలూగించిన మోసగాళ్లకు మోసగాడు సినిమా గుర్తుంది కదా. ఈ సినిమాలో విలన్లను తుదముట్టించే క్రమంలో హీరో కృష్ణ కూడా మోసగాడిగా మారిపోయిన తెరపై కళ్లప్పగించి చూశాం కదా.ఇప్పుడు ఏ మందుకూ లొంగకుండా మానవాళిని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసిన కరోనా వైరస్ ను తుదముట్టించే క్రమంలో మన డీఆర్డీఓ రూపొందించిన 2-డీజీ కూడా సేమ్ టూ సేమ్ సినిమాలో కృష్ణ మాదిరిగానే… కరోనా పాలిట మోసగాళ్లకు మోసగాడిగా మారిపోతుందట.వెరసి కరోనా మన శరీరంలోని కణాలను ఎలాగైతే మోసం చేసి ప్రొటీన్‌ను లాగేస్తుందో… అదే రీతిన 2-డీజీ కూడా తాను గ్లూకోజ్ పరమాణువునేనంటూ కరోనా వైరస్‌ను బురిడి కొట్టించి దానిలోకి ప్రవేశించి… దాని పునరుత్పత్తిని ఆపేస్తుందట.వెరసి వారం,రోజులు కాదు… కేవలం గంటల వ్యవధిలోనే మన శరీరంలోని కరోనా వైరస్‌ను చంపేస్తుందట.
మానవ శరీరంలోని కణాలతో కలిసిపోయి..
అదెలాగో చూద్దాం పదండి.ఏ వైరస్ అయినా మానవ శరీరంలోని కణాలతో కలిసిపోయి.. తాను కూడా వాటి మాదిరి కణాన్నేనన్న భావనను కలిగిస్తుంది.అలా మన కణాలను మోసం చేసి వాటి నుంచి ప్రోటీన్ వాడుకుని పదింతలవుతుంది.ఇలా వైరస్ ఇబ్బడిముబ్బడిగా పెరగటానికి మన శరీరం నుంచి గ్లూకోస్ కణాల అవసరం తప్పనిసరి. ఈ గ్లూకోజ్ అణువుల నుంచి వైరస్‌కి శక్తి వస్తుంది.ఆ శక్తితో మళ్ళీ పదింతలౌతుంది.ఇలా రక్తభీజునిలా పెరుగుతున్న కణాలతో మన రక్తంలోని తెల్లకణాలు పోరాటం చేస్తాయి. ఓ వైపు మన కణాల్లోని ప్రొటీన్‌ను దొంగిలిస్తూ… మన రక్తంలోని గ్లూకోజ్‌ను తీసుకుంటూ కరోనా వైరస్ ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతూ ఉంటే… వాటిని ఎదుర్కొనే తెల్లరక్త కణాల సంఖ్య మాత్రం ఆ మేర పెరగదు.వెరసి కరోనా వైరస్ కణాలతో పోరులో అతి తక్కువ సంఖ్యలో కనిపించే తెల్లకణాలు ఓడిపోయినప్పుడు మనిషి మరణిస్తాడు.
కొన్ని గంటల వ్యవధిలోనే..
అయితే డీఆర్డీఓ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న 2-డీజీ ఔషధం… కరోనా వైరస్ మన కణజాలాన్ని ఎలాగైతే మోసం చేస్తుందో.. అదే రీతిన తాను గ్లూకోజ్ రేణువునంటూ కరోనా వైరస్‌ను బురిడీ కొట్టిస్తుందట. అలా తన ఎదుగుదలకు అవసరమైన గ్లూకోజం దొరికేసిందిలే అన్న భావనతో 2-డీజీని కరోనా వైరస్ ఎప్పుడైతే మింగుతుందో… దానిలో పునరుత్పత్తి ఠక్కున నిలిచిపోతుందట.ఇలా మన శరీరంలోకి ఎంట్రీ ఇచ్చిన కరోనా వైరస్ సంఖ్య పెరగకుండా చేయడం 2-డీజీ దిగ్విజయంగా చేసినట్టు ఇప్పటికే ప్రయోగాల్లో తేలింది.ఇక మన శరీరంలోకి ఎంట్రీ ఇచ్చిన కరోనా వైరస్‌ను అడ్డుకునేందుకు తెల్ల రక్త కణాలు ఎలాగూ తమదైన శైలిలో పోరును మొదలెడతాయి.ఈ క్రమంలో 2-డీజీ ప్రభావంతో కరో్నా వైరస్ల సంఖ్య ఏమాత్రం పెరగకపోగా.. తెల్లరక్త కణాల దాడిలో మన బాడీలోకి ఎంట్రీ ఇచ్చిన వైరస్‌లు ఓడిపోతాయి. చివరకు మన శరీరంలోకి ఎంట్రీ ఇచ్చిన కరోనా వైరస్ చనిపోతుంది. ఈ ప్రక్రియ కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే పూర్తి అవుతుందట.
2-డీజీ ఔషధం పౌడర్ రూపంలో..
డీఆర్డీఓ రూపొందించిన 2-డీజీ ఔషధం పౌడర్ రూపంలో ఉంటుంది.దీనిని మనం నీళ్లలో కలుపుకుని తాగితే సరిపోతుందట.ఇప్పటికే ఈ ఔషధం మాస్ ప్రొడక్షన్‌కు సంబంధించి డీఆర్డీఓ నుంచి మన హైదరాబాదీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీ అనుమతులు పొందిన సంగతి తెలిసిందే.డాక్టర్ రెడ్డీస్‌లో ఇప్పటికే ఈ ఔషధం ప్రొడక్షన్ ప్రారంభం కాగా… నేడు 10 వేల డోసులు విడుదల కానున్నాయట. అంతా అనుకున్నట్లుగా జరిగితే… కరోనా వైరస్ మనలను ఏమీ చేయలేదనే చెప్పాలి.జలుబు కంటే కూడా చిన్న జలుబుగా ఈ వైరస్ ప్రభావం మారిపోతుంది.ఈ ఔషధాన్ని తీసుకున్న కొన్ని గంటల్లోనే కరోనా వైరస్ పూర్తిగా మన శరీరం నుంచి నిష్క్రమించడంతో అసలు ఇది ఓ జబ్బు కిందకే రాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. సో… 2-డీజీ ఎంట్రీ మనకు గుడ్ న్యూస్ కాగా… కరోనా వైరస్‌కు మాత్రం బ్యాడ్ న్యూసేనని చెప్పక తప్పదు.










