కరోనా సంక్షోభం నుంచి ఆదుకోడానికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి పెద్ద స్పందన లేకపోయినా తమిళ చిత్ర పరిశ్రమ మాత్రం స్పందిస్తోంది. నిన్న హీరో సూర్య, అతని తమ్ముడు కార్తి, తండ్రి శివకుమార్ తో కలిసి వెళ్లి కోటి రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి స్టాలిన్ కు అందజేసిన సంగతి తెలిసిందే. తాజా సూపర్ స్టార్ రజినీ కాంత్ కుమార్తె సౌందర్య కూడా స్పందించారు. కోటి రూపాయల విరాళాన్ని ఆమె సీఎం సహాయనిధికి అందజేశారు.
కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. గత 24 గంటల్లో ఈ తమిళనాడు వ్యాప్తంగా 30 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉన్నప్పటికీ.. కోవిడ్ కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో తమిళ సినీ తారలు అక్కడి కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తున్నారు. కరోనా బాధితులకు సహాయం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందజేసేందుకు ముందుకు వస్తున్నారు.
తెలుగు చిత్ర పరిశ్రమలోని హీరోలు కూడా ఈ విషయంలో ఒకరినొకరు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈసారి ఎలాంటి సహాయక చర్యలు చేపడితే బాగుంటున్నదానిపై మెగాస్టార్ చిరంజీవి తన సన్నిహితులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది సీసీసీ పేరుతో సహాయక చర్యలు చేపట్టరు. మరి ఈసారి ఏం చేయబోతున్నారో చూడాలి.
Must Read- కోవిడ్ పై పోరాటానికి సూర్య కుటుంబం రూ.1 కోటి విరాళం;