మహిళా ఉద్యమకారులు, ఫెమినిస్టుల మీద అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఓ యూట్యూబ్ బ్లాగర్ ను ముగ్గురు మహిళలు అతని ఇంటికి వెళ్లి చితక్కొట్టారు. ఘాటుగా బెదిరించారు. ఇలాంటి పోస్టులు మరోసారి చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
తిరువనంతపురంలో తంపనూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఉండే గాంధారి అమ్మన్ కోవిల్ రోడ్ లో విజయ్ పి నాయర్ నివాసం ఉంటారు. ఆయన ఆఫీసు కూడా అదే. ఆయన ఒక యూట్యూబర్. ఆయన ఇటీవల మహిళా ఉద్యమకారులు, ఫెమినిస్టులకు వ్యతిరేకంగా ఒక యూట్యూబ్ వీడియో పెట్టారు.
దీనిపై వెటరన్ డబ్బింగ్ ఆర్టిస్ట్ భాగ్యలక్ష్మి, ఇంకా దియా సనా, శ్రీలక్ష్మి అరక్కల్ అతని ఇంటికి వెళ్లి దాడి చేశారు. బలవంతంగా అతనితో క్షమాపణ చెప్పించుకున్నారు. విజయ్ పి నాయర్ మీద దాడిచేసిన మొత్తం వ్యవహారాన్ని వారు కూడా యూట్యూబ్ లోనే లైవ్ ప్రసారం చేశారు.
గతిలేని పరిస్థితుల్లో చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నాం అని ఆ మహిళలు వీడియోలో చెప్పడం స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకూ విజయ్ పి నాయర్ మీద మహిళలు ఇంతగా ఆగ్ర హించడానికి కారణం ఏంటా అనుకుంటున్నారా…? ఆయన తన యూట్యూబ్ లో ఓ వీడియో పెట్టారు. దాని టైటిలే వివాదాస్పదం. అదేంటంటే.. ‘‘ఇండియా, ప్రత్యేకించి కేరళలోని ఫెమినిస్లులు ఎందుకు అండర్ వేర్ వేసుకోరంటే..’’ అని వీడియో చేశారు. ఇదే వారి ఆగ్రహానికి కారణమైంది. వీరి దాడిపై పోలీసు కేసు కూడా నమోదైంది.
విజయ్ పి నాయర్ పై మహిళలు దాడిచేసిన వీడియో చూడండి :
https://www.youtube.com/v=qNQaHrGgTqo