కర్ణాటక రాష్ట్రంలో శివమొగ్గ ప్రాంతంలో ఊహించని విధంగా భారీ పేలుడు సంభవించింది. 50 డైనమెట్లు ఒక్కసారిగా పేలినట్లు సమాచారం. శివమొగ్గ ప్రాంతానికి దగ్గరలోని క్వారీలోని రాళ్లు పేల్చడానికి పేలుడు పదార్థాలు లారీలో తరలిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. దాదాపు రాత్రి ప్రాంతం 10:30 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో దాదాపు 8 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మృతుల సంఖ్య పెరగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
Pained by the loss of lives in Shivamogga. Condolences to the bereaved families. Praying that the injured recover soon. The State Government is providing all possible assistance to the affected: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 22, 2021
పేలుడు దాటికి శివమొగ్గ ప్రాంతానికి చుట్టు పక్కన ఉన్న దావణగెరె, చిక్‌మగళూరు జిల్లాల్లోని ప్రజలు సైతం పేలుడు శబ్దం దాటికి భూకంపంగా భావించి పరుగులు తీశారు. శివమొగ్గలోని స్థానికుల ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోవడంతోపాటు.. రోడ్డుకు పగుళ్లు ఏర్పడ్డాయి. తీవ్రస్ధాయిలో పేలుడు జరగడంతో ప్రజలకు కాసేపు ఏమి జరుగుతుందో కూడా అర్థం కాక భయాందోళనలకు గురయ్యారు. కర్ణాటక సిఎం యడ్యూరప్ప విచారణకు ఆదేశించారు. ఈ సంఘటన పట్ట పిఎం నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
మోడీ Must Read ;- రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం











