యువ హీరో నాగశౌర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ లక్ష్య. ఈ చిత్రానికి సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా విభిన్న కథాంశంతో ఈ మూవీ రూపొందుతోందని ఫస్ట్ లుక్ నుంచి ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది. ఈరోజు నాగశౌర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా లక్ష్య మూవీ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ విషయానికి వస్తే.. జగపతి బాబు వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ స్టార్ట్ అయ్యింది.
చాలా మందికి ఆటతో గుర్తింపు వస్తుంది కానీ.. ఎవడో ఒక్కడు పుడతాడు. ఆటకే గుర్తింపు తెచ్చేవాడు.. అని చెప్పిన జగపతిబాబు మాటలను బట్టి నాగశౌర్య క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. విలు విద్యలో రాణించాలనుకునే హీరో దానికి దూరం అవ్వడం మళ్ళీ తిరిగి రెట్టించిన ఉత్సాహంతో రావడం.. ఆడియన్స్ లో ఆసక్తిని కలిగించేలా ఉంది. ఈ క్యారెక్టర్ కు తగ్గట్టుగా నాగశౌర్య ఎంత కష్టపడ్డాడో ఈ టీజర్ కనిపిస్తుంది.
ఈ టీజర్ చివరిలో నాగశౌర్య 8 ప్యాక్ చూపించడం.. జగపతిబాబు క్యారెక్టర్ చూపించడం సినిమా పై మరింత ఆసక్తిని కలిగించాయి. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. టీజర్ పై ఒక్క మాటలో చెప్పాలంటే.. లక్ష్య టీజర్ అదిరింది. ఇప్పటి వరకు ఉన్న అంచనాలను పెంచేసిందని చెప్పచ్చు. సమ్మర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- నాగశౌర్యకు ‘పోలీసు వారి హెచ్చరిక..!’











