ప్రపంచ ప్రఖ్యాత సోమనాథ్ దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు సోమనాథ్ ఆలయ ట్రస్ట్ యొక్క ధర్మకర్తలలో సభ్యుడిగా మాత్రమే ప్రధాని మోడీ ఉన్నారు. తాజాగా ఆలయ బోర్డు ధర్మకర్తలు సోమనాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్‌గా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తరువాత, ఆలయ ట్రస్ట్ చైర్మన్‌గా నియమితులైన రెండవ ప్రధాని నరేంద్ర మోడీ రికార్డు సృష్టించారు. సోమనాథ్ ఆలయ ట్రస్ట్ కు ఎనిమిదవ చైర్మన్‌గా మోదీ వ్యవహరిస్తారు.
గత ఏడాది అక్టోబర్లో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ మరణించిన తరువాత సోమనాథ్ ట్రస్ట్ చైర్మన్ పదవి ఖాళీగా ఉంది. 2004-2020 వరకు 16 సంవత్సరాలపాటు కేశుభాయ్ పటేల్ చైర్మన్‌గా పనిచేశారు.
ప్రస్తుతం ఆలయ ధర్మకర్తలలో సభ్యులుగా ఉన్న బిజెపి నాయకులు ఎల్కే అద్వానీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ కు చెందిన పండితుడు జెడి పర్మార్, వ్యాపారవేత్త హర్షవర్ధన్ నియోటియా తదితరులు ఉన్నారు. తాజా పరిణామాల్లో ప్రధాని నరేంద్ర మోడీ పేరును ఛైర్మన్ గా అమిత్ షా ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Must Read ;- రెండు రోజుల్లో రూ.100 కోట్లు.. అయోధ్య రామ మందిరానికి విరాళాలు











