ప్రజాశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాలన పగ్గాలు చేపట్టింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే.. 6 గ్యారెంటీ హామీలపై, వికలాంగురాలికి ఉద్యోగం ఇస్తూ రెండు ఫైళ్ళపై సంతకం చేశారు.
తెలంగాణ ప్రజల హృదయాన్ని గెలుచుకున్న కాంగ్రెస్.. రాష్ట్రంలో తనదైన మార్క్ రాజకీయాలకు తెరతీస్తోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను తక్షణమే అమలులోకి వచ్చేలా సంతకం చేసి.. అధికారులను ఆదేశించారు. రేపటి నుంచి ఆరు గ్యారెంటీ హామీలు అమలులోకి రానున్నాయి. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు.. ‘మహాలక్ష్మీ’ పధకం ద్వారా మహిళలకు పెద్దపీట, రైతులను ఆదుకునేలా ‘రైతు భరోసా’, ‘గృహజ్యోతి’ కార్యక్రమం ద్వారా ఉచిత విద్యుత్తు.., ఐదు లక్షల ఆర్ధిక సాయంతో ‘ఇందిరమ్మ ఇళ్ళ’ పధకం.., ‘యువ వికాసం’ పధకం ద్వారా యువత విద్యకు ఐదు లక్షల ఆర్ధికసాయం.., ‘చేయూత’ పధకం ద్వారా పింఛన్ల పెంపు.., ‘ఆరోగ్య శ్రీ’ పధకం కింద రూ. 10 లక్షల ఇన్సురెన్స్ వంటివి నేటి నుంచి అమలులోకి రానున్నాయి.
వీటిని తక్షణమే అమలు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై కసరత్తు జరుగుతోంది. వచ్చే నెల నుంచి ఈ పథకాలన్నీ ప్రజా క్షేత్రంలో అమలుకు కార్యరూపం దాల్చనున్నది.
కర్నాటక మోడల్లో తెలంగాణలో కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు ప్రజలు ఆకర్షితులయ్యారు. ప్రజలకు ఏమీ కావాలో అదే అందించేందుకు ఇటువంటి బృహత్తర పధకాలను తీసుకొచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పధకాలను తక్షణమే అమలయ్యేలా.. ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఈ ఫైల్ పై తొలి సంతకం చేశారు.
అలానే నాంపల్లిలో నివాసం ఉంటున్న రజిని అనే దివ్యాంగురాలికి రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఉద్యోగం అందజేస్తూ .. రేవంత్ రెడ్డి సంతకం చేశారు. దీంతో తెలంగాణ యువత గత పదేళ్ళుగా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చిందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారం, హామీ మేరకు యువతకు కొలువులు అందజేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.











