మాజీ రెజ్లర్, డబ్ల్యూడబ్ల్యూయీ సూపర్‌స్టార్ గబ్బి టఫ్ట్ సంచలన ప్రకటన చేశారు. తాను ట్రాన్స్‌జెండర్‌గా మారినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. తాను మహిళగా మారిన ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది నేనే.. దీని గురించి ప్రకటించడానికి నేను సిగ్గుపడటం లేదు.. భయపటడం లేదు’.. అని ట్యాగ్ చేశారు.
ఇదే నా అసలైన నీడ..
తాను మహిళగా మారడానికి తన భార్య మద్దతుగా నిలిచిందని ప్రకటించారు గబ్బి. ఓ భావోద్వేగపు పోస్టు చేశారు. ‘‘నేను చెప్పిన ఈ న్యూస్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇది నేనే. దీని గురించి నేను సిగ్గుపడటం లేదు. ఈ విషయాన్ని చెప్పడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. ప్రపంచం ఏమనుకుంటుందో అని భయపడ్డాను. అందుకే ఇన్నాళ్లు దాచాను. కానీ ఎంతోకాలంగా నేను దాచిన నా నీడ ఇదే. నా కుటుంబం, స్నేహితులు ఈ విషయం గురించి ఎంతగానో భయపడి పోయారు. కానీ.. ఇప్పుడిక నేను దేనికీ భయపడను. నేను ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పగలను.. ఎలా ఉన్నా నన్ను నేను అమితంగా ప్రేమించుకోగలను’… అంటూ తన మనోగతాన్ని వెలిబుచ్చాడు.
https://twitter.com/GabeTuft/status/1357441555926310912?s=20
రెజ్లంగ్ స్టార్ టు ట్రాన్స్ జెండర్..
2007 నుంచి రెజ్లింగ్ ప్రారంభించిన టఫ్ట్ 2014 లో రింగ్‌కు వీడ్కోలు పలికారు. ఇక కెరీర్‌లో డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్స్ రా, స్మాక్‌డౌన్, రెసిల్ మేనియాలతో తలపడ్డారు. రెజ్లింగ్ నుంచి రిటైర్ అయిన తరువాత.. తన భార్య ప్రిస్సిల్లా, కుమార్తెతో ఎక్కువ సమయం గడిపారు. ప్రస్తుతం ఫిట్నెస్ కోచ్, మోటివేషనల్ స్పీకర్‌గా కెరీర్‌ని రీస్టార్ట్ చేశారు. కాగా.. తాని ట్రాన్స్ జెండర్ గా మారడానికి తన భార్య పూర్తిగా మద్దతు నిలిచిందని సంతోషం వ్యక్తం చేశారు.











