June 26, 2026 2:24 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

అమరావతికి డబుల్‌ ధమాకా.. రాజధానికి మరిన్ని సొబగులు..!

April 14, 2025 at 7:42 PM
in Andhra Pradesh, Editorial, Editors Pick, General, Latest News, Politics
Share on FacebookShare on TwitterShare on WhatsApp

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సమీకరణ విధానంలో భూములిచ్చేందుకు మరిన్ని గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకురావడంతో ప్రభుత్వం ప్రతిపాదనలు రెడీ చేస్తోంది. మెజార్టీ రైతులు ముందుకొచ్చిన గ్రామాల్లో ప్రారంభించి దశలవారీగా భూ సమీకరణ చేసే అంశాన్ని చురుగ్గా పరిశీలిస్తోంది. కొన్ని గ్రామాల రైతులు మంత్రి నారాయణను కలిసి తమ భూములు సమీకరణలో తీసుకోవాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణానికి 2015లో భూసమీకరణ ప్రారంభించినప్పుడే పెదపరిమి, హరిశ్చంద్రపురం తదితర గ్రామాల రైతుల నుంచి తమ భూములూ తీసుకోవాలన్న వినతులు వచ్చాయి. కానీ అప్పట్లో ప్రభుత్వం మొదట 217 చ.కి.మీ. పరిధిలో అమరావతిని నిర్మించాలని, భవిష్యత్తు అవసరాలనుబట్టి తదుపరి భూసమీకరణపై నిర్ణయం తీసుకోవాలని భావించింది.

ప్రస్తుతం రాజధానిలో వివిధ అవసరాలకు పోగా CRDA దగ్గర రెండు వేల ఎకరాల భూమి మాత్రమే మిగులుతోంది. మరోవైపు రాజధానిలో భూములు కేటాయించాలని వివిధ సంస్థల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు
వస్తున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకే సుమారు 4 వేల ఎకరాలు కావాలని అంచనా. ఓ పక్క రాజధాని అవసరాలు పెరుగుతుండడం, మరోపక్క తమ భూములను తీసుకోవాలంటూ వివిధ గ్రామాల రైతులు స్వచ్ఛందంగా ముందుకొస్తుండటంతో ప్రభుత్వం భూసమీకరణ ప్రతిపాదనలు రూపొందిస్తోంది. రాజధానికి ఒకపక్క సరిహద్దుగా నది ఉంది…దానిని దాటి వెళ్లరు. మంగళగిరి వైపు పాత జీటీ రోడ్డు వరకు ఇప్పటికే భూసమీకరణ చేసేశారు. మిగతా రెండు వైపులా భూమిని సమీకరించే యోచనలో ప్రభుత్వం ఉంది.

2 వేల ఎకరాలు చాలదు –
రాజధాని నిర్మాణానికి తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో 28 గ్రామాల పరిధిలో సమీకరణలో 37 వేల 941 ఎకరాలు తీసుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా..కొంత పెండింగ్‌లో ఉంది. ఇప్పటివరకూ 34,689 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. ఇంకా 3,252 ఎకరాలను సమీకరించాలి. రాజధానిలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి 2014-19 మధ్య సింగపూర్‌కు చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్షియానికి ప్రభుత్వం 1,691 ఎకరాలు కేటాయించింది. జగన్‌ ప్రభుత్వం ఆ సంస్థలతో ఒప్పందం రద్దుచేసుకుని తరిమేసింది.

మళ్లీ స్టార్టప్‌ ప్రాజెక్టు చేపట్టేందుకు సింగపూర్‌ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఒకవేళ సింగపూర్‌ సంస్థలు ముందుకు రాకపోతే, వేరే అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించి స్టార్టప్‌ ప్రాజెక్టు చేపట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దాని కోసం గతంలో కేటాయించిన 1,691 ఎకరాలను అలాగే ఉంచుతోంది. జగన్‌ ప్రభుత్వం రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను విధ్వంసం చేయడమే లక్ష్యంగా అమరావతిలో ఆర్‌ 5 జోన్‌ను సృష్టించి, 1,500 ఎకరాల్లో బయటి ప్రాంతాలకు చెందినవారికి అక్కడ ఇళ్ల పట్టాలిచ్చింది. ప్రస్తుతం ఆ వ్యవహారం కోర్టులో ఉండటంతో..CRDA ఆ భూముల జోలికి వెళ్లడం లేదు.

రాజధానిలో నిర్మాణ పనుల కోసం 300 ఎకరాల్లో మట్టి తవ్వేందుకు వివిధ గుత్తేదారు సంస్థలకు సీఆర్‌డీఏ గతంలో అనుమతులిచ్చింది. అక్కడ చాలా పెద్ద గోతులు ఏర్పడ్డాయి. ఈ 300 ఎకరాలు కూడా తక్షణం ఉపయోగపడవు. భవిష్యత్తులో అక్కడ మల్టీ లెవెల్‌ పార్కింగ్‌ వంటి ప్రాజెక్టు చేపట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం రాజధాని పనులను శరవేగంగా పట్టాలెక్కించడంతో…విద్య, వైద్యం, వాణిజ్యం, వినోదం, ఆతిథ్యం తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పలు దేశ, విదేశీ సంస్థలు ముందుకొస్తున్నాయి. బిట్స్‌, XLRI వంటి సంస్థలు భూములు కోరుతున్నాయి. వివిధ కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల కార్యాలయాలు, పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు సైతం పెద్ద ఎత్తున భూములు కావాలి.

భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి వంటి ప్రాంతాలను కలిపి మెగాసిటీగా అభివృద్ధి చేయాలన్న దీర్ఘకాలిక ప్లాన్ కూడా ఉంది. ఇందులో భాగంగానే అమరావతికి ఇన్నర్‌ రింగ్‌రోడ్డుతోపాటు అవుటర్‌ రింగ్‌రోడ్డునూ నిర్మిస్తోంది. దీంతో రాజధానిలో భూముల కోసం మరింత డిమాండ్‌ పెరుగుతోంది. అమరావతిని స్వయం అభివృద్ధి ప్రాజెక్టుగా ప్రభుత్వం ప్రకటించింది. అమరావతి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక వనరులను అక్కడినుంచే సమకూర్చుకోవాలన్నది లక్ష్యం. దీనికి భూములు అవసరం. మరావతి చుట్టుపక్కల పెద్దగా ప్రభుత్వ భూములు లేకపోవడం, భూముల కోసం డిమాండ్‌లు పెరుగుతుండటం, CRDA దగ్గర అపరిమితంగానే భూమి ఉండటం, సమీకరణలో భూములు ఇచ్చేందుకు స్వచ్ఛందంగా రైతులు ముందుకొస్తుండటంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు ప్రారంభించింది.

ఎయిర్‌పోర్టుకు 4 వేల ఎకరాలు –
రాజధాని అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల నివేదిక రూపొందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ ఇప్పటికే టెండర్లు పిలిచింది. రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని MRO సదుపాయం, శిక్షణ కేంద్రాలతో సమీకృతంగా ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ యోచన. దీనికి సుమారు 4 వేల ఎకరాలు కావాలని అంచనా. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఒక ప్రముఖ సంస్థ ఇప్పటికే ఆసక్తికనబరిచింది

Tags: #AmaravatiAmaravati AP capital latest newsAmaravati latest newsandhra pradeshAP CM Chandrababu Naiduap farmersAP farmers voluntarily give more lands for Amaravatiap latest newsap politicsleonewsleotop
Previous Post

విశాఖ ఉక్కు మరింత స్ట్రాంగ్‌.. కేంద్రం ప్యాకేజీతో భారీ లాభాలు..!

Next Post

బీసీలకు చంద్రబాబు సర్కార్‌ పెద్ద పీట..!

Related Posts

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

by లియో డెస్క్
June 25, 2026 3:37 pm

రాయలసీమ ప్రజల దశాబ్దాల కల, రాష్ట్ర విభజన చట్టంలోని ప్రధాన హామీ అయిన...

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

by లియో డెస్క్
June 23, 2026 9:53 am

తన జేబులోని సొమ్ము కాదు.. తన పార్టీ ఖజానాలోని సొమ్ము కూడా కాదు.....

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

by లియో డెస్క్
June 22, 2026 8:18 pm

ఎంగిలిచేత్తో కాకిని కూడా తోలని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వం సొమ్మును పంచి...

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

by లియో డెస్క్
June 20, 2026 8:14 am

వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి డబుల్ స్టాండర్డ్స్‌ విధానాలు, రాజకీయ అవకాశవాదంపై...

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

by లియో డెస్క్
June 16, 2026 8:00 am

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని, ప్రజలను దోచుకున్నది చాలదన్నట్లు.. గుళ్లను, ఆ గుడుల్లో దేవుడి...

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

by లియో డెస్క్
June 15, 2026 7:12 pm

అధికారం కోల్పోయినా వైసీపీ నేతల తీరు మారడం లేదు. రాజకీయం చేయడం చేతకాక,...

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

by లియో డెస్క్
June 11, 2026 6:32 pm

విశాఖ స్టీల్ ప్లాంట్ దుర్ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఇలాంటి కష్టకాలంలో...

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

by లియో డెస్క్
June 6, 2026 3:47 pm

ఆంధ్రప్రదేశ్‌లో బ్లూ ఎకానమీ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే...

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

by లియో డెస్క్
June 5, 2026 3:28 pm

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు విశాఖపట్నం వేదికగా సరికొత్త చరిత్రకు...

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

by లియో డెస్క్
June 4, 2026 1:40 pm

జనసేన చీఫ్‌ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారనే అంశంపై సోషల్...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే… !

తెలుగు సినిమాలో ఎస్వీఆర్ యశస్సు

Bollywood Hot Beauty Dinky Kapoor Bold Look Images

శశికళ జైలు నుండి విడుదల

కొల్లు రవీంద్రకు బెయిల్

గొప్ప మనసు చాటుకున్న వైఎస్ జగన్

అప్పన్నకు శఠగోపం! :నెల్లూరు మోసంతో కూసాలు కదులుతున్నాయ్!!

ముఖ్య కథనాలు

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

సినిమా

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా జగన్.!

మోదీపై వైసీపీ ఎటా*క్.. కాంగ్రెస్ గూటికి జగన్..?

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

జనరల్

పట్టాలపైకి కడప స్టీల్‌ ప్లాంట్‌.. రెండేళ్లలో ఉక్కు.. చంద్రబాబు డెడ్‌లైన్.!

బొత్సపై గుస్సా.. కాపునేతల సాయానికి జగన్ బ్రేకులు!

కాపులకు క్యాష్ బిస్కెట్లు.. కుట్రవెనుక సీక్రెట్ ఇదే!

శ్రీశైలం మల్లన్నకే పంగనామాలు.. బరితెగించిన వైసీపీ ఎమ్మెల్యే..!

హోమ్‌ మంత్రి అనితపై గుడ్డు మంత్రి అమర్‌నాధ్‌ వెకిలి కూతలు..!

విశాఖ బాధితుల పక్షాన లోకేష్..జగన్ అబద్ధాల కోటలు బద్దలు..!

ఏపీలో అక్వా కారిడార్‌.. ఆంధ్రా రొయ్యలకు కొత్త బ్రాండ్‌..

విశాఖ తీరంలో చంద్రబాబు సైకిల్‌ సవారీ..

నువ్వెవడివి రా..ప్రకాష్ రాజ్‌ Vs బండ్ల గణేష్ కౌంటర్..!

మంగళగిరిలో తొలిసారిగా మహానాడు నిర్వహణ..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist