దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి, కనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కనిక అసలు పేరు కనిక థిల్లాన్. ఆమె బాలీవుడ్ లో ఫేమస్ రైటర్. 2014 లో ప్రకాష్, కనిక పెళ్లి చేసుకున్నారు. అనుష్క నటించిన సైజ్ జీరో మూవీకి వీరిద్దరూ కలిసి వర్క్ చేసారు. కనిక కథను అందించగా, ప్రకాష్ ఈ మూవీని డైరెక్ట్ చేసారు. ఈ సినిమా అనుష్క కెరీర్ లోనే డిజాస్టర్ గా నిలిచింది. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. వీరిద్దరూ విడిపోయారు అని వార్తలు వచ్చాయి కానీ.. అప్పుడు స్పందించలేదు.

విషయం ఏంటంటే.. లాస్ట్ ఇయర్ కోర్టు ఇద్దరికీ విడాకులు మంజూరు చేసిందని తెలిసింది. దీంతో ఆమె మళ్ళీ పెళ్లి చేసుకుంటోంది. ఇంతకీ ఎవర్ని పెళ్లి చేసుకోబోతుందంటే… బాలీవుడ్ లో ఫేమస్ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ హిమాంషు శర్మతో ప్రేమలో పడింది. అయితే.. ఆ విషయాన్నీ ఆమె ఇప్పుడు బయటపెట్టింది. జనవరిలో వీరి పెళ్లి జరగనుందని సమాచారం. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ సోమవారం జరిగింది. ఆ ఫోటోలను కనిక ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. పలువురు సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియచేసారు.

ఇదిలా ఉంటే.. ప్రకాష్ కోవెలమూడి ఓ టాప్ హీరోయిన్ ని పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వచ్చాయి. దీంతో ఏ హీరోయిన్ ని పెళ్లి చేసుకోనున్నారు అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఎన్ని వార్తలు వచ్చినా ప్రకాష్ కానీ… రాఘవేంద్రరావు కానీ స్పందించలేదు. ఇప్పుడు కనిక పెళ్లి చేసుకోబోతుంది. మరి.. ప్రకాష్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.











