కామారెడ్డి: బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానానికి కరోనా బెడద తప్పలేదు. ఈ మహమ్మారి తీవ్రతతో దేవస్థానాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వర్‌రావు ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రావణ మాసం సందర్భంగా భక్తులు ఈ దేవాలయాన్ని తెరవాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల కోరిక మేరకు ఆలయ కమిటీ దేవాలయాన్ని తెరిచారు. శ్రావణ మాసం ముగిసి భాద్రపద మాసం రావడంతో బాటు కరోనా ఉదృతి తగ్గకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత తిరిగి ఆలయ తలుపులు తెరుస్తామని అధికారులు తెలియచేశారు.
ఏపీలో పేదలకు ఇళ్లస్థలాలు.. నవంబరు నుంచి భూసేకరణ!
ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు లేని నిరుపేదలకు కూటమి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పనుంది. అర్హులైన...











