మధ్యప్రదేశ్ ఇండోర్ ప్రాంతానికి సమీపంలో భూపంకం ఏర్పడింది. అధికారుల సమాచారం మేరకు రిక్టార్ స్కేలుపై 3.3గా నమోదైంది. ఇది మధ్యాహ్నం 1.24కు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇండోర్ ప్రాంతానికి 157 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం నమోదైందని అధికారులు తెలియజేశారు. నేషనల్ సెంటర్ ఆప్ సిస్మాలజీ భూకంప వివరాలను మీడియాకు అందించింది. భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు జరిగినట్లు తెలియరాలేదు. భూకంపానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.










