రామతీర్థ రాజకీయం రాజుకుంటుంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, దేవుళ్లు, ప్రమాణాలతో రాజకీయం వేడెక్కుతోంది. టీడీపీపై దొంగ ఆరోపణలు చేస్తున్నారంటూ నారా లోకేష్ సిఎం జగన్‌పై ధ్వజమెత్తారు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో తేల్చుకుందాం అంటూ లోకేష్ విసిరిన సవాలుకు విజయసాయి రెడ్డి ‘నేను రెడీ’ అంటూ సమాధానమివ్వడంతో లోకేష్ స్ట్రాంగ్ కౌంటిచ్చారు.
మరోసారి సవాల్… నాపై జగన్ రెడ్డి చేస్తున్న,చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవం అని సింహాద్రి అప్పన్న పై ప్రమాణం చెయ్యడానికి సిద్ధం. @ysjagan సిద్ధమా?(2/2)
— Lokesh Nara (@naralokesh) January 2, 2021
420 జగన్ రెడ్డికి సవాలు విసిరితే 840 ఎందుకు మొరుగుతోందంటూ కౌంటరిచ్చారు. ఏ1కి స్పందించేంత ధైర్యం లేదా అంటూ ట్విట్టర్ వేదికగా సిఎంని నిలదీశారు. దైవ ప్రమాణం అనగానే తోక ముడిచి పారిపోతున్న వాళ్ల ప్రవర్తనే చెప్తుంది వారు ఎలాంటి వారన్నది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై బురద జల్లడం తప్ప ఇంకేం చేయగలరంటూ గద్దించి ప్రశ్నించారు నారా లోకేష్. మరోసారి అవకాశమిస్తున్నానంటూ జగన్ రెడ్డిని సవాలు చేశారు నారా లోకేష్.











