నిన్న రాములోరు, నేడు సీతమ్మ తల్లి.. దుండగుల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. ఒకవైపు రాముల వారి శిరస్సు ఖండించిన ఘటన రావణ కాష్టంలా రగులుతూ ఉండగానే.. ఇంకోవైపు విగ్రహాల విధ్యంసాలు ఆగడం లేదు. తాజాగా విజయవాడలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కి సుమారు వంద మీటర్ల దూరంలో, వందలాది మంది తిరిగే విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వద్ద ఉన్న సీతారామ మందిరం వద్ద, సీతమ్మ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసి నేలపై పడవేశారు దుండగులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఎవరు చేశారు అనే దానిపై ఇప్పటివరకు సమాచారం లేదు. పోలీసుల అలసత్వం వల్లే విగ్రహ ధ్వంసాలు జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కర్నూలులో సీతారాముల విగ్రహం ధ్వంసం.. ఏకంగా హుండీనే మాయం!











