మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న 152వ చిత్రం ‘ఆచార్య’. అజేయ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై రోజు రోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. మొన్నామధ్య విడదులైన ‘ఆచార్య’ టీజర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చి పడ్డాయి.అందులోని చిరు పెర్ఫార్మెన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. ఈ సినిమాను మే 13న విడుదల చేస్తున్నందున.. షూటింగ్ ను ఆగమేఘాల మీద కంప్లీట్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల.
ఇటీవల మారేడుమిల్లి, ఖమ్మంలో జరిగిన షెడ్యూల్ లో రామ్ చరణ్, చిరు మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించిన టీమ్ .. ఇప్పుడు హైద్రాబాద్ షెడ్యూల్ లో బ్యాలెన్స్ సీన్స్ చిత్రీకరణ సాగిస్తున్నారు. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు హిందీలో నూ విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ క్రమంలో ‘ఆచార్య’ సినిమాకి రెండు భాషల్లో అడ్డుంకులు ఏర్పడే అవకాశాలున్నాయంటున్నారు.
సరిగ్గా ఆచార్య విడుదల రోజునే అంటే.. మే 13న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తోన్న రాధే విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న రాధే సినిమా.. బాలీవుడ్ లో ఆచార్య సినిమాకి ఖచ్చితంగా గట్టి పోటీనే . అలాగే.. కలెక్షన్స్ పై కూడా భారీగా ప్రభావం చూపించే అవకాశముంది. ఇక ‘ఆచార్య’కి మలయాళం నుంచి కూడా అడ్డంకి ఏర్పడే అవకాశముంది. సరిగ్గా అదే రోజు మాలీవుడ్ లో మోహన్ లాల్ నటించిన పీరియాడికల్ మూవీ ‘మరక్కార్ : అరబిక్కడలిండే సింహం’ సినిమా విడుదల కాబోతోంది. చిరు కి అక్కడ మంచి ఇమేజే ఉన్నప్పటికీ .. మోహన్ లాల్ సినిమా కాబట్టి.. ఆచార్య కలెక్షన్స్ లో ప్రభావం చూపించే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి ఆచార్య ఈ రెండు చోట్లా ఎలా నెగ్గుకు వస్తుందో చూడాలి.
Must Read ;- మళ్ళీ బిగ్ బీ, మెగాస్టార్ కాంబో?











