చిరంజీవి .. కొరటాల శివ కాంబినేషన్లో ‘ఆచార్య’ సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా విశేషాలను తెలుసుకోవడానికి మెగా అభిమానులంతా ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు ‘మారేడుమిల్లి’ పరిధిలోని అడవుల్లో జరుగుతోంది. ఈ సినిమాలో చరణ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. చరణ్ పాత్ర తెరపై కనిపించేది కాసేపే అయినా, ఆయన పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. కొన్నిరోజులుగా మారేడుమిల్లి అడవుల్లో చరణ్ పై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

తాజాగా ఈ షెడ్యూల్లో చరణ్ తో పాటు చిరంజీవి కూడా జాయిన్ అయ్యారని సమాచారం. చిరంజీవి .. చరణ్ కాంబినేషన్లోని కొన్ని యాక్షన్ సన్నివేశాలను అక్కడ తెరకెక్కిస్తున్నారట. అవినీతికి .. అక్రమాలకు పాల్పడుతున్న గ్యాంగ్ పై, చిరంజీవి – చరణ్ విరుచుకుపడే పోరాట సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. చిరు – చరణ్ ఒకేసారి స్క్రీన్ పై కనిపించడం, అదీ యాక్షన్స్ సీన్ లో కలిపి దుమ్మురేపేయడం మెగా అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించే విషయం.
కొరటాల శివ సినిమాల్లో పూర్తి వినోదం ఉంటుంది .. ఆ వినోదంలోనే సందేశం కలిసి ఉంటుంది. అదే సమయంలో ఆయన పాటల పరంగా .. యాక్షన్ సీన్స్ పరంగా ప్రేక్షకులను హుషారెత్తిస్తాడు. కథను ఒక ‘ఉగాది’ పచ్చడిలా తయారుచేస్తాడు గనుకనే ఆయన సినిమాలు అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతుంటాయి. కథపై ఆయన చేసే కసరత్తు నచ్చడం వల్లనే, చిరు ఆయనకి ‘ఆచార్య‘ను అప్పగించాడు. మే 13వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి సరసన నాయికగా కాజల్ అలరించనుండగా, చరణ్ జోడీగా పూజా హెగ్డే కనువిందు చేయనుంది.
Must Read ;- మెగాస్టార్ తోనే కృష్ణవంశీ రైతు?











