మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న క్రేజీ యాక్షన్ మూవీ ‘ఆచార్య’. మే 13న విడుదలవుతోందంటూ.. తేదీ ప్రకటించినప్పటి నుంచి ఈ సినిమా ను ఆగమేఘాల మీద తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. దాదాపు షూటింగ్ చివరిదశకి చేరుకుందనే టాక్ నడుస్తోంది. మొన్నీ మధ్యనే చిరు , చరణ్ ల మీద ఆసక్తికరమైన సన్నివేశాల్ని, యాక్షన్ సిక్వెన్సెస్ ను మారేడుమిల్లి షెడ్యూల్ లో చిత్రీకరించారు. దీంతో ఈ సినిమాకి సంబంధించిన రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది.
ఆచార్య లుక్స్, టీజర్ అన్నీ అభిమానుల్ని ఖుషీ చేశాయి. దీంతో సినిమాకి ఓ రేంజ్ లో బిజినెస్ కూడా జరిగింది. ఇక మరొక్కటే బాకీ ఉండి పోయింది. అదే.. రామ్ చరణ్ పోషించిన సిద్ధ పాత్రకు సంబంధించిన లుక్. సిద్ధగా చెర్రీ ఎలా ఉండబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇప్పుడు దర్శకుడు కొరటాల ఆ ప్రయత్నంలోనే ఉన్నాడని తెలుస్తోంది.
నిజానికి షూటింగ్ లో పాల్గొనే తొలి రోజున చెర్రీ సజెషన్ లో బ్యాక్ పోజ్ ఒకటి విడుదల చేశారు మేకర్స్. అందులో అతడి గెటప్ గురించి ఒక అవగాహనకు వచ్చారు అభిమానులు. అంతకు ముందు ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా ఆకట్టున్నాయి. త్వరలోనే రామ్ చరణ్ సిద్ధ పాత్రతో మెగాభిమానుల్ని సర్ ప్రైజ్ చేయబోతున్నారట మేకర్స్. మరి ఆ పోస్టర్ తో ‘ఆచార్య’ సినిమా మీద హైప్ ఇంకెంతగా పెరుగుతుందో చూడాలి.
Must Read ;- మెగా ‘ఆచార్య’కు రామ్ చరణ్ ఎలాంటి శిష్యుడో?