ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫోకస్ అంతా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఫుష్ప’ మూవీ మీదే. ఆగస్ట్ 13న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ను శరవేగంతో పరుగులు తీయిస్తున్నాడు సుక్కూ. ఈ సినిమా టాక్ పార్ట్ కంప్లీట్ అయ్యాకా.. బన్నీ.. కొరటాల శివ చిత్రం మీదకి తన ఫోకస్ ను షిఫ్ట్ చేయబోతున్నాడు. కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఈ సినిమా షూట్ కంప్లీట్ కాగానే.. బన్నీ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను మొదలు పెట్టబోతున్నాడు.
మొన్నా మధ్య బన్నీ కొరటాల సినిమా లాంఛింగ్ జరుపుకుంది. అయితే ఇంతవరకూ ఇందులో నటించబోయే ఇతర నటీనటులెవరు అన్న విషయంలో క్లారిటీ రాలేదు. అయితే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ విలన్ గా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇప్పటి నుంచి లాక్ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చ్ 31న మూవీని విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అందుకే బన్నీ, కొరటాల ప్రస్తుతం తాము చేస్తున్న ప్రాజెక్ట్స్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేసే ఉద్దేశంతో ఉన్నారు. మరి ఈ సినిమా అనుకున్న డేట్లోనే నిజంగా విడుదలవుతుందో లేదో చూడాలి.
Must Read ;- నలుపు రంగు మేకప్ తో నలుగుతున్న ‘పుష్ప’ రాజ్ బన్నీ