బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, మెగాస్టార్ చిరంజీవిల మధ్య మంచి అనుబంధముంది. ఆ రిలేషన్ షిప్ వల్లే చిరంజీవి పాన్ ఇండియా సినిమా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో ఒక ప్రత్యేక పాత్రలో చిరు అడగ్గానే నటించడానికి అంగీకరించారు అమితాబ్. అందులో నరసింహారెడ్డి పాత్రధారికి గురువు పాత్రలో అమితాబ్ అద్భుతంగా నటించారు.
ఇప్పుడు చిరంజీవికి అమితాబ్ రుణం తీర్చుకొనే అవకాశ మొచ్చిందని టాక్ . మరో సారి ఈ ఇద్దరి కాంబో మూవీ రాబోతోంది అని తెలుస్తోంది. అది కూడా ఓ బాలీవుడ్ మూవీలో . అమితాబ్ ప్రధాన పాత్ర పోషించబోతున్న ఓ బాలీవుడ్ సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర ఉందట. అందులో చిరంజీవి నటిస్తే బాగుంటుందని బిగ్ బీ చిరుని కోరారట. అమితాబ్ లాంటి వ్యక్తి అడగ్గానే చిరంజీవి రెండో మాట లేకుండా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. మరి ఇందులో నిజానిజాలేంటో తెలియదు కానీ.. ఈ వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది.
Must Read ;- రైతు కొడుకు రైతు కావడానికి ‘శ్రీకారం’ చుట్టాలి: చిరంజీవి