టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై యూ-ట్యూబ్ లో పేక్ వీడియో అప్ లోడ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో తెలుగుయువత నాయకులు ఫిర్యాదు చేశారు. మరోసారి తాగి అడ్డంగా బుక్కైన నారా లోకేష్ కాల్ లీక్ అని పేక్ వీడియో అప్ లోడ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఏపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీరామ్ చిన్నబాబు, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు బండారు వంశీకృష్ణ, TNSF రాష్ట్ర అధ్యక్షుడు మనం ప్రణవ్ గోపాల్‌లు ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Must Read ;- కేసులతో చంద్రబాబు గడ్డం మీద వెంట్రుక కూడా పీకలేరు : నారా లోకేష్











