రాయలసీమకు చెందిన బీసీ యువనేతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు యువత సారథ్య బాధ్యతలు దక్కాయి. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన గుండ్లపల్లి శ్రీరామ్ (చినబాబు)ను రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు అధ్యక్షుడుగా నియమిస్తూ.. రాష్ర్ట పార్టీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు విడుదల చేశారు. జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు అచ్చెన్నాయుడు ప్రకటనలో తెలిపారు.
అన్నిరకాలుగా సమతూకం
ప్రాంతాలవారీ సమతూకంతో పాటు, కులాల వారీ సమతూకం పాటించడం తెలుగుదేశం ప్రధానంగా భావిస్తుంటుంది. ఆ క్రమంలో రాయలసీమకు చెందిన సమర్థుడైన యువనాయకుడికి తెలుగు యువత పట్టం కట్టాలని అన్వేషించారు. అన్ని రకాల పార్టీ పదవుల నియామకాలు పూర్తయినప్పటికీ.. తెలుగు యువత పదవిమాత్రం ఖాళీగానే ఉండిపోయింది.
సుదీర్ఘ అన్వేషణ తర్వాత.. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన గుండ్లపల్లి శ్రీరామ్ (చినబాబు)ను ఎంపిక చేశారు. శ్రీరామ్ బీసీ- పద్మసాలి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిగా.. సమర్థుడున, అందరితో కలివిడిగా ఉంటూ.. తెలుగు యువతను ముందుకు తీసుకెళ్లగలడనే విశ్వాసంతో పార్టీ పదవి అప్పగించినట్లుగా తెలుస్తోంది.
Must Read ;- విశాఖలో కృష్ణా జలాల యాజమాన్య బోర్డు అందుకేనా?