కరోనా టైమ్ లో నటుడు నవీన్ చంద్రకు ఓటీటీ స్టార్ గా మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా నవీన్ చంద్ర హీరోగా చేస్తున్న ఓ క్రైమ్ థ్రిల్లర్ సబ్జెక్ట్ నెట్ ఫ్లిక్స్ కు బాగా నచ్చిందట. ఇందులో బాలీవుడ్ నటి, మణిరత్నం ‘రోజా’ హీరోయిన్ మధుబాల ఓ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోంది. నవీన్ చంద్ర నటించిన ‘భానుమతి రామకృష్ణ’, ‘సూపర్ ఓవర్’ సినిమాలు ఆహా ఓటీటీలో విడుదలైనప్పుడు మంచి స్పందన వచ్చింది.
నవీన్ నటించే కొత్త చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. హైదరాబాద్, చెన్నైలో షూటింగ్ చేస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. వేసవిలో ఈ సినిమాని విడుదల చేయటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రెండు భాషల హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ భారీ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా ద్వారా అరవింద్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నారు. మధుబాల ఇంతకుముందు 2013లో సుమంత్ అశ్విన్ నటించిన ‘అంతకుమించి ఆ తర్వాత’ చిత్రంలో నటించింది.
Must Read ;- మణిరత్నం ‘నవరస’ ఫస్ట్ లుక్ ఇదే











