కరోనా కేసులు పెరగుతున్నందున ఏపీ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. రేపటి నుంచి తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్కులు ధరించకుండా తిరిగితే గ్రామీణ ప్రాంతాల్లో రూ.500, పట్టణాల్లో రూ.1,000 ఫైన్ వసూలు చేయాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ఈ మేరకు ఫైన్‌కు సంబంధించిన పుస్తకాలు అందినట్టు పోలీసు అధికారులు తెలిపారు. కరోనా రెండో దశ వ్యాపిస్తున్నందున్న నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలకూ ఇప్పటికే ప్రభుత్వం పలు చూచనలు చేసింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కూడ అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే.
డీఎస్సీపై బిగ్ ఫేక్ సర్కస్.. బ్లూ మీడియా భారీ కుట్ర..
కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మెగా డీఎస్సీపై రోజుకో కుట్ర చేస్తున్న వైసీపీ.....











