మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్స్ గా నిలిచాయి. మొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ నుంచి చూసుకుంటే.. ‘ఊరికిచ్చినమాట, మనవూరి పాండవులు, పల్లెటూరి మొనగాడు, కొండవీటి రాజా, ఆలయ శిఖరం, అల్లుడా మజాకా’ లాంటి సినిమాలన్నీ చిరుకి మంచి పేరు తెచ్చిపెట్టాయి . ఆ తర్వాత మళ్లీ ఆయన ఆ తరహా చిత్రాల్లో నటించలేదు. చాన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఓ పల్లెటూరి చిత్రంలో చిరు నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
‘ఆచార్య’ మూవీ తర్వాత చిరంజీవి.. ‘లూసిఫర్’ మలయాళ రీమేక్ లోనూ, అలాగే.. వేదాళం తమిళ సినిమా రీమేక్ లోనూ నటిస్తున్నారు. దీంతో పాటే .. బాబీ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. కోనవెంకట్ స్ర్కిప్ట్ అందిస్తున్న ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. బాబీ ఇంతకు ముందు యన్టీఆర్ తో ‘జై లవకుశ, వెంకీమామ’ తరహాలో ఎమోషనల్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కనుందట. ఇక ఇందులో బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. మరి పల్లెటూరి మొనగాడు గా మరోసారి చిరు ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాలి.











