PM Kisan Samman Nidhi :
కేంద్ర ప్రభుత్వం 2019లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రారంభించింది. అయితే, ఈ పథకంలో భాగంగా ప్రతి ఏడాది రూ.6వేల రూపాయలను మూడు విడతలలో రూ.2వేల చొప్పున అందజేస్తుంది. గత కొద్దీ రోజుల నుంచి ఎనిమిదవ విడత డబ్బులు ఏప్రిల్ 1 నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటి వరకు ఏ రైతు ఖాతాలో పీఎం కిసాన్ నగదు జమ కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలలో ప్రచారంలో బిజీగా ఉండటంతో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. తాజాగా కేంద్ర వ్యవససాయ శాఖ సహయ మంత్రి కైలాష్ స్పందించారు. ఏప్రిల్ చివరి నాటికి 20 నుంచి 25 మధ్య ఎనిమిదవ విడత డబ్బులు రెండు వేల రూపాయలను ప్రతి ఒక్కరి అకౌంట్లో జమ చేయనున్నట్లు చౌదరి తెలిపారు.
Must Read ;- విశాఖ ఉక్కు ప్రైవేటీకరిస్తే లాభాలు, లేదంటే మూతే కేంద్రానికి ‘ఉక్క’పోత











