రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పథకం తీసుకొచ్చింది. అదే ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. దేశంలోని అర్హులైన రైతులందరీకి మోదీ గవర్నమెంట్ నిధులు మంజూరు చేస్తోంది. ప్రతి ఏడాది కొంత మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ పథకం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరనుంది. వ్యవసాయ పనిముట్లు, ఎరువులు కొనుకోలు చేయడానికి ఉపయోగపడుతుంది.
అర్హులైన రైతులకు రూ.2 వేలు
ఇప్పటికే 7 విడతలుగా రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అందాయి. కొద్ది రోజుల్లో మరో విడుత డబ్బులు అకౌంట్ జమకానున్నాయి. ఎనిమిదో విడత డబ్బులు రైతులకు అందించాలని మోదీ సర్కార్ నిర్ణయం తీసుకోవడంతో, అర్హులైన రైతులకు రూ.2 వేలు అందనున్నాయి.
Must Read ;- ఎన్నికల వేళ.. మోదీ సర్కారుకి రైతు సంఘాల ఊహించని షాక్











