Idols Vandalised at Kuppam :
చిత్తూరు జిల్లా కుప్పం లో విగ్రహాలు ధ్వంసమయ్యాయి. బేటగుట్ట కొండపై 200 ఏళ్ల చరిత్ర ప్రాధాన్యం ఉన్న శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి బయట పడేశారు. అర్చకుడు వినయ్ గుట్ట పరిసరాల్లో గాలించాడు, దేవుళ్లకు సంబంధించిన తలతో పాటు కాళ్లూ, చేతులూ ఖండించిన స్థితిలో చెల్లాచెదురుగా పడివున్న విగ్రహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న కుప్పం పోలీసులు ధ్వంసమైన విగ్రహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. కుప్పంలో పురాతన విగ్రహాలు ధ్వంసం కావడం పట్ల టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విగ్రహాలు ధ్వంసం కావడం పట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. సీబీఐ తో విచారణ జరిపించి, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Must Read ;- ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన సీఎం : టీడీపీ నాయకులు నారా లోకేశ్, అయ్యన్నపాత్రుడు
చిత్తూరుజిల్లా, కుప్పం మండలం గోనుగూరు సమీపంలోని బేటగుట్టపై శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని విగ్రహాల ధ్వంసం అత్యంత బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం, దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి.(1/2) pic.twitter.com/Ow2islJ58W
— N Chandrababu Naidu (@ncbn) April 6, 2021