లాస్ట్ ఇయర్ ‘అల వైకుంఠపురములో’ మూవీతో బిగ్గెస్ట్ హిట్ సొంతం చేసుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఏడాది బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ పాన్ ఇండియా మూవీ కోసం సూపర్ మేకోవర్ తో అభిమానుల్ని అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బన్నీ ఊరమాస్ లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా నటిస్తున్నాడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ‘పుష్ప’ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుంది.
ఇంతవరకూ ‘పుష్ప’ సినిమాకి సంబంధించి.. ఫస్ట్ లుక్ పోస్టర్స్, పుష్ప ప్రీల్యూడ్ వీడియో తప్ప.. మరే విధంగానూ ప్రచారాలు మొదలు కాలేదు. అయితే.. నేడు బన్నీ పుట్టిన రోజు సందర్బం సాయంత్రం 6.12 గంటలకు బన్నీ కేరెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమా కు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాల్ని పుష్ప టీమ్ పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టింది.
ఇంతవరకూ చిత్రీకరణ జరుపుకున్న పార్ట్ కు డబ్బింగ్ పనులు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ పాల్గొన్నారు. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమా బన్నీకి ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- అల్లు అర్జున్ తో ప్రశాంత్ నీల్ సినిమా.. నిజమేనా?