ప్రకాశం జిల్లాలో మానవత్వం మంటగలిసిన సంఘటన వెలుగు చూసింది. ప్రసవానికి వచ్చినామెను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చుకోకపోవడంతో నడిరోడ్డుపైనే దారినవెళ్లే మహిళలు కాన్పు చేశారు.మార్కాపురం సాయిసింధూర ఆసుపత్రికి గర్భణీని కాన్పు కోసం తీసుకు వచ్చారు.అయితే ఆమెను చేర్చుకునేందుకు ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించలేదు. మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్ కేర్ సెంటరుగా మార్చడంతో,సాయి సింధూర ఆసుపత్రిలో కాన్పుల వార్డు ఏర్పాటు చేశారు.అయితే ఆసుపత్రిలో గర్భిణీని చేర్చుకోకపోవడంతో ఆసుపత్రి మెట్ల ముందే కొందరు మహిళలు చీరలు అడ్డుగా పెట్టి కాన్పు చేసిన ఘటన సంచలనంగా మారింది.ఆసుపత్రి ముందే ఇంత జరుగుతున్నా వైద్యులు, సిబ్బంది కనీసం పట్టించుకోకపోవడం శోచనీయం.
మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!
తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...











