టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కరోనాపై పోరాడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్ కు లేఖలు రాశారు. ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ‘మీకు సెల్యూట్’ అంటూ ప్రశసించారు. ఈ మేరకు కుప్పం నియోజకవర్గంలోని ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి లేఖలు రాశారు. ఈ లేఖలను స్థానిక టీడీపీ నాయకులు ఫ్రంట్ లైన్ వారియర్స్ కు అందించారు. కరోనా సమయంలోమీరు ప్రదర్శిస్తున్న ధైర్య సాహసాలు అసాధారణం, ఆదర్శనీయం, అభినందనీయమని అన్నారు.
గతంలో ఎన్నడూ చూడని ప్రమాదకర విపత్తును ఎదుర్కొంటున్నామని, ఈ ఆపదకాలంలో మీరు అందించే సేవలు ఎనలేనివని ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలను కొనియాడారు. ప్రాణాలకు తెగించి ప్రజల కోసం పనిచేస్తున్న మీకు దేశం మొత్తం సెల్యూట్ చేస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు.
must Read ;- చంద్రబాబు విజన్ ఉన్న నేత.. హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు : సోనూసూద్











