మే 27, 28 తేదీల్లో మహానాడు నిర్వహించనన్నట్లు టీడీపీ పొలిట్ బ్యూరో పేర్కొంది. అయితే కరోనా నేపథ్యంలో డిజిటల్ ఫ్లాట్ ఫారంలో మహానాడు నిర్వహిస్తామని తెలిపింది. ఈ మేరకు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకుంది. కరోనా బాధితులను పరామర్శించడానికి వెళ్తే అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడింది. ప్రతిపక్షాలను దెబ్బ తీయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, హైకోర్టు చెప్పిన జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ నాయకుడు జనార్ధన్ ను వెంటనే విడుదల చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో డిమాండ్ చేసింది.
Must Read ;- కరోనా రోగులను గాలికొదిలేసి నిర్భంధాలపైనే దృష్టి: చంద్రబాబు











