‘‘చంద్రబాబు గొప్ప విజన్ ఉన్న నేత.. ఆయన ఎందరికీ ఆదర్శం. ఆయన వల్లే హైదారబాద్ అన్నిరంగాల్లో ముందుకెళ్లింది, ఐటీని పటిష్టం చేశారు’’ సీని నటుడు సోనూసూద్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సేవలను కొనియాడారు. కరోనా నేపథ్యంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సోనుసూద్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సోనుసూద్ సేవలను కొనియాడారు. కరోనా వేళ సోనూసూద్ అనేక సేవలు చేశారని, అటువంటి వారు సమాజానికి అవసరమని చెప్పారు. ఆరోగ్యంపై ప్రతిఒక్కరూ శ్రద్ధ వహించాలన్నారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలన్నారు. అనంతరం సోనుసూద్ మాట్లాడుతూ కరోనా సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ ట్రస్టు సేవలు అందిస్తోందని, సమాజం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బాధ్యతయుతంగా పనిచేయాలన్నారు.
Must Read ;- కష్టపడిందంతా చంద్రబాబు.. కియా క్రెడిట్ తమదేనంటూ వైసీపీ మంత్రి కలరింగ్











