Interesting Update About Nagarjuna’s Bangarraju Movie :
బంగార్రాజు.. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న సినిమా. ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్ పైకి వచ్చింది. ఇటీవల ప్రారంభమైన ఈ సినిమా ఈ నెల 25 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే.. బంగార్రాజు.. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి ప్రీక్వెల్ అని కొంత మంది కాదు కాదు.. ఇది సీక్వెల్ అని కొంత మంది అంటున్నారు. దీంతో బంగార్రాజు సీక్వెలా..? ప్రీక్వెలా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఇదే విషయం గురించి దర్శకుడు కళ్యాణ్ కృష్ణను అడిగితే.. అసలు విషయం బయటపెట్టారు.
ఇంతకీ ఏం చెప్పారంటే… బంగార్రాజు సినిమా సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్ కాదు.. ప్రీక్వెల్ కాదు.. ఇదొక ఫ్రెష్ స్టోరీ. గతంలో సోగ్గాడే చిన్ని నాయనా సినిమా చూడని వాళ్లకు కూడా ఇది కనెక్ట్ అవుతుంది. అయితే.. అప్పటి సినిమాను గుర్తు తెచ్చేందుకు సినిమా ప్రారంభంలో సోగ్గాడే సినిమా క్లిప్స్ కొన్ని చూపించబోతున్నాం. కథ-స్క్రీన్ ప్లేకు ఇది అవసరం అని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ చెప్పారు. ఇక అఖిల్ కూడా ఈ సినిమాలో నటించనున్నాడా అని అడిగితే.. బంగార్రాజు సినిమాలో నాగచైతన్య, నాగార్జున మాత్రమే కనిపిస్తారు. నిజానికి ఈ సినిమాలో అఖిల్ కూడా ఉండాల్సింది.
స్క్రిప్ట్ లో అలా ప్లాన్ చేశాం కానీ.. ప్రస్తుతం అఖిల్ చేస్తున్న సినిమాతో బంగార్రాజుకు కాల్షీట్లు క్లాష్ అవుతున్నాయి. అందుకే అఖిల్ ను తీసుకోలేకపోయాం అని కళ్యాణ్ కృష్ణ చెప్పారు. ఈ క్రేజీ మూవీని సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి… సంక్రాంతికి వచ్చే బంగార్రాజు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.











