పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటిల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ, క్రేజీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. మలయాళంలో విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీకి రీమేక్ ఇది. ఈ సినిమాకి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్వకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు – స్ర్కీన్ ప్లే అందిస్తుండడం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగు, రీసెంట్ గా రిలీజ్ చేసిన అంత ఇష్టం ఏందయ్యా.. అంటూ సాగే పాట సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇలా.. పాటలు, టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో భీమ్లా నాయక్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి కానుకగా భీమ్లా నాయక్ ని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. భీమ్లా నాయక్ నుంచి ఓ వర్కింగ్ స్టిల్ ను రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి సినిమా సెట్ లో పక్కపక్కనే సేదతీరుతూ కనిపించారు.
ఇందులో పవన్ మంచ పైన, రానా దగ్గుబాటి ఎండ్ల బండి పైన సేద తీరుతూ కనిపించారు. ఈ స్టిల్ చూసిన ప్రేక్షకాభిమానులు పవర్ ఫుల్ పిక్చర్ ఆఫ్ ది డే అంటూ కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పవర్ పిక్ వైరల్ అవుతుంది. ఈ వర్కింగ్ స్టిల్ సినిమా పై మరింతగా క్యూరియాసిటీని పెంచేసిందని చెప్పచ్చు. సంక్రాంతికి భీమ్లా నాయక్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. మరి.. బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.











