టీకాను అధికారకంగా దేశంలో లాంచ్ చేయడానికి ముందు భారత్‌లో ట్రయిల్ రన్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఆంధ్రప్రదేశ్, పంజాబ్, గుజరాత్, అసోం రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఆదేశాలు అందుకున్న రాష్ట్ర ప్రభుత్వాలు, వెంటనే ఆశా వర్కర్లు, నర్సులను సిద్ధం కావాలని ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రయిల్ రన్ కోసం కృష్ణ జిల్లాను ఎంపిక చేసింది. జిల్లాలోని 6 ప్రభుత్వ ఆసుపత్రులు, మెడికల్ కాలేజీలను ట్రయిల్ రన్ సిద్ధం చేయాల్సింది ప్రభుత్వం స్పష్టం చేసింది.
6 లక్షల మందికి వ్యాక్సిన్..
లండన్‌లో పరిస్థితి రాను రాను దారుణంగా మారుతుంది. కరోనా కేసులతోపాటు.. కొత్తరకం కరోనా కేసులు ఎక్కవ కావడంతో ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఇప్పటికే 6 లక్షల మందికి ఫైజర్ వ్యాక్సిన్ అందించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మొత్తంగా 6,16933 మందికి ఫైజర్ మొదటి డోసును వేసినట్లు అధికారక లెక్కలను విడుదల చేసింది ప్రభుత్వం. ఇందులో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం కృతజ్ఞతలు తెలిపింది.
Must Read ;- కోవిడ్ వ్యాక్సినేషన్ @ రికమండేషన్!
ఫ్రాన్స్‌ను తాకిన కొత్తరకం కరోనా..
కరోనా దాటికే తట్టుకోలేకపోతున్న ప్రపంచానికి ఈ కొత్తరకం కరోనా మరింత కలవరపాటుకు గురిచేస్తుంది. అనుకున్నట్టుగానే కొత్తరకం కరోనా వ్యాప్తి దేశాలను దాటేస్తుంది. తాజాగా ఫ్రాన్స్‌లో కొత్తరకం కరోనా కేసు నమోదైనట్టు ఫ్రాన్స్ వెల్లడించింది. అక్కడి ఆరోగ్య సంస్థ అందించిన సమాచారం మేరకు, లండన్‌లో విస్త్రుతంగా ప్రబలుతున్న కరోనాలోని కొత్తరకం మొదటి కేసు ఫ్రాన్స్‌లో కనుగొన్నారు. ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు అధికారులు.
మెక్సికోలో మొదలైన గ్రూప్ వ్యాక్సిన్..
వ్యాక్సిన్ ఆమోదించడం.. దాన్ని అందరికీ అందించడం.. ఇలా పనులన్నీ చకచకా చేసుకుపోతుంది అమెరికా ప్రభుత్వం. పైగా ప్రభుత్వంలోని పెద్దలకు లైవ్‌లో టీకాలు వేసి మరీ ప్రజల్లోని భయాలను పోగొట్టడానికి ప్రయత్నిస్తుంది అక్కడి ప్రభుత్వం. తాజాగా మెక్సికోలో అధిక సంఖ్యలో వ్యాక్సినేషన్‌కి శ్రీకారం చుట్టింది. అక్కడి ప్రజలందరూ వీక్షించేలా టెలివిజన్‌లో లైవ్ కార్యక్రమంలో చూపిస్తూ.. మొదటగా 59 ఏళ్ల నర్సుతో ప్రారంభించారు. ఒక్కరోజులో మెక్సికోలో 3 వేల మందికి వ్యాక్సినేషన్ అందించేలా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ వీక్షించేలా అక్కడి టెలివిజన్లు మొదటిరోజు కార్యక్రమాన్ని లైవ్ ఇవ్వడానికి సిద్ధమయ్యాయి.
Must Read ;- భారత్‌లోనూ మొదలైన కొత్త కరోనా ప్రకంపనలు