పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాలా భీమ్లా నాయక్ గ్లింప్స్ అదరగొట్టేశారు. పవన్ కళ్యాణ్ పాత్ర తీరు సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ఫైట్ సీక్వెన్స్ తో ది సౌండ్ ఆఫ్ భీమ్లా ప్రోమోను విడుదల చేశారు. థీమ్ సాంగ్ తో కూడిన ప్రోమో ఇది. ఈ సాయంత్రం 7 గంటల తర్వాత ఈ ప్రోమో విడుదలైంది. పవర్ స్టార్ కనిపించడానికి ముందు ఓ బండి మీద నుంచి బస్తాలు ఎగిరి పడతాయి. ఆ తర్వాత పవర్ స్టార్ విశ్వరూపం కనిపిస్తుంది. ‘నాగరాజు గారూ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండీ.. మీకు దీపావళి పండగ ముందుగానే వచ్చిసిందండి’ అనే డైలాగ్ రిమోట్ నొక్కగానే ఓ జీపు అంతెత్తున ఎగిరిపడింది.
దీంతో పాటు ఈ నెల 7వ తేదీ లాలా భీమ్లా సాంగ్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించేశారు. మొత్తానికి పవర్ స్టార్ అభిమానులకు ఇది ఫీస్ట్ అనే చెప్పాలి. టైటిల్స్ లో త్రివిక్రమ్ పేరుతో పాటు దర్శకుడు సాగర్ కె. చంద్ర పేరు ఉంది కాబట్టి మాటల మాంత్రికుడి హస్తం ఇందులో ఉన్నట్లు స్పష్టమైంది. కేవలం డైలాగులే కాకుండా స్క్రీన్ ప్లే కూడా ఆయన అందించారు. ఎస్. ఎస్. తమన్ స్వరకల్పనలో రూపొందిన లాలా భీమ్లా పాట కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ ప్రోమో కూడా అమాంతం వ్యూస్ ను కొల్లగొట్టింది. ఇప్పటికే టైటిల్ సాంగ్ పవర్ స్టార్ అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.
రెండు రకాల టీజర్స్ ను కూడా విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. కాకపోతే రెండు పాన్ ఇండియా చిత్రాలైన ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ లతో పోటీ పడి ఈ చిత్రం విడుదల కాబోతోంది. విడుదల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఈ ప్రచార కార్యక్రమం చూస్తేనే అర్థమవుతోంది. తనదైన మాస్ లుక్ తో పవర్ స్టార్ కూర్చుని ఉన్న లుక్ మాత్రం అదిరిపోయింది. ఆయన ముందు మందు బాటిల్, జిలెటిన్ స్టిక్స్ కూడా పెట్టుకుని ప్రత్యర్థుల దుమ్ముదులిపేసినట్టు అర్థం చేసుకోవాలి. మొత్తానికి దీపావళికి ఒకరోజు ముందే భీమ్లా నాయక్ మందుగొండి సామగ్రిని పేల్చేశారు.











