ఆగష్టు మాసంలో ‘ఆపరేషన్ – ఎయిడెడ్’
దేశానికి ఆగష్టు నెలలో స్వాతంత్య్రం వస్తే .. ఆ ఆగష్టు నెలలోనే మన రాష్ట్రంలో ఎయిడెడ్ విద్యాలయాలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు హరించి వేయబడ్డాయని చెప్పవచ్చు. జగన్ రెడ్డి ప్రభుత్వ కాలాన్ని ఒక చీకటి యుగంగా భావిస్తున్న ప్రజలకు.. ఎన్నో వ్యవస్థల విధ్వంస రచనలు కళ్లకు కట్టింది. ఈ కోవకు చెందిందే ‘ఆపరేషన్ – ఎయిడెడ్’ విలీన ప్రక్రియ కూడా. ఎయిడెడ్ విద్యాసంస్థలను విలీనం చేసుకోవాలని ఆగష్టు 8న ఆర్డినెన్స్ ద్వారా వేసిన స్కేచ్.. అదే నెలలో 14వ తేదీనా కార్యరూపం దాల్చింది. అన్నిజిల్లాలకు నోడల్ అధికారులను నియమించి ఎయిడెడ్ విలీన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న 137 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు నిరభ్యంతరంగా వ్యతిరేకించాయి. ఇందులో కేవలం 10 విద్యా సంస్థలే ఒత్తుళ్లుకు తలొగ్గి షరతులను ఒప్పుకుని విలీనానికి అంగీకరించాయి. ప్రభుత్వ పాలనలోని విధాన పరమైన లోపాలను, విద్యార్థుల భవిష్యత్తును దృషిలో ఉంచుకుని మరో 127 కళాశాలలు విలీనాన్ని క్షేత్రస్థాయిలో వ్యతిరేకించి, ఉద్యమాల బాట పట్టాయి. అలా వ్యతిరేకించిన విద్యాలయాల్లోని అధ్యాపకులను బలవంతపు బదీలకు పధక రచన చేశారన్నది ఎయిడెడ్ వాదన.
విద్యాసంస్థలను మూసివేస్తామే కానీ .. విలీనంకానీవ్వం!
గడిచిన రెండు నెలలుగా ఎయిడెడ్ విద్యాసంస్థలు చెబుతున్న మాట ఇదే. అవసరం అనుకుంటే విద్యాసంస్థలను మూసివేస్తేమే కానీ .. ప్రభుత్వంలో విలీనానికి అంగీకరించడమనేదే జరగదని తెగేసి చెప్తున్నాయి. కానీ ప్రభుత్వంలో ఎయిడెడ్ విద్యాలయాలను తప్పనిసరిగా విలీనం చేయాల్సిందేనని జగన్ రెడ్డి ప్రభుత్వం కంకణం కట్టుకుంటే .. అంతే స్థాయిలో ఎయిడెడ్ యాజమాన్యలు ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ భీష్మించాయి. రోడెక్కి నిరసనలు తెలియజేస్తూ వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 137 ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో 127 కళాశాలు పూర్తిగా విలీనానికి వ్యతిరేకం అని తెలియజెప్పాయి. తమ పూర్వీకుల నుంచి వస్తున్న విద్యాలయాలకు చెందిన ఆస్తులు, వ్యవస్థలను మీకు ధారదత్తం చేసేందుకు ససేమీర ఒప్పుకొం అని ఖరాకండిగా చెప్పేశాయి. మీరు జీతాలిచ్చి పోషిస్తున్న అధ్యాపకులను మాకివ్వకపోయినా పర్వలేదు .. మేం మాత్రం మీ చేతుల్లో మా సంస్థలను అప్పగించేందుకు ఎట్టిపరిస్థితులో అంగీకరించబోమని నిర్ద్వందంగా చెప్పారు. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అక్కడున్న అధ్యాపకులను ప్రభుత్వ కళాశాలకు బదిలీ చేస్తూ హుకుం జారీ చేసింది. దీంతో 2 లక్షల 50 వేలమంది విద్యార్థుల భవిష్యత్తు నేడు గందరగోళంలో పడింది.
ప్రత్యమ్నాయ చూపండి .. కేంద్రం మాటలకు తలగ్గొదు!
కేంద్రం తీసుకొచ్చి ‘జాతీమ విద్యావిధానం – 2020’తో ఏపిలో ‘ఆపరేషన్ – ఎయిడెడ్’ కు బీజం పడింది. ప్రభుత్వం లేక ప్రైవేటు విద్యా సంస్థలు మినహా .. ఎయిడెడ్ అనే పదం ప్రజాస్వామ్యంలో కనిపించకూడదన్నదే దీని ప్రధాన ఉద్దేశ్యమన్నది ఒక రాజకీయ విమర్శ. స్టేప్ – వన్ లో ఏపిలోని డిగ్రీ కళాశాలలోని పనిచేస్తున్న అధ్యాపకులను ప్రభుత్వం కళాశాలకు బదీలి చేయడంతో ఎయిడెడ్ కళాశాలలో అధ్యాపకుల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో దేవుడు లేని ఆలయాలు మాదిరిగా అధ్యాపకులు లేని ఎయిడెడ్ విద్యాలయాలు దర్శనమిచ్చాయి. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ఎయిడెడ్ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు టీసీలిచ్చి వేరే కళాశాల వెళ్లండి అని పంపిస్తుంటే .. మరికొందరూ వారి ఆశయాలు, పూర్వీకులు లక్ష్యాలను బతికించుకోవడానికి కళాశాలను ప్రైవేటు యాజమాన్యం చేతులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో నెట్టివేయపడుతోంది. ప్రభుత్వ చర్యతో ఏపిలో ఒక్కసారిగా అండర్ గ్రాడ్యూయేషన్ విద్యా మిథ్యగా తయారైంది. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో అరకొరగా ప్రభుత్వ కళాశాలలు ఉన్నా .. వాటిలో సరిపడ సీట్లు, అధ్యాపకుల కొరతతో కునారిల్లుతున్నాయి. ప్రత్యమ్నాయం విద్యావ్యవస్థను సృష్టించకుండా .. ఇలా అర్థాంతరంగా కళాశాలల్లోని అధ్యాపకులను బదిలీ చేయడం ఏమిటని విద్యార్థి సంఘాలు అక్రోశిస్తున్నాయి.
అంతా చేసి .. యూటర్న్ తీసుకుంటే ఎలా ?
ఎయిడెడ్ కళాశాల వంతు అయిపోయింది. ఇక మిగిలింది జూనియర్ కళాశాలలు, పాఠశాలలు వంతు. స్టేప్ – టూ లో వీటికీ ఇదే పరిస్థతి రానున్నదని ఎయిడెడ్ యాజమాన్యాలు గుర్తించారు. అనేక నిరసనలు, ఉద్యమాలనంతరం నిన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడుతూ .. ఎయిడెడ్ కు ప్రభుత్వం వ్యతిరేకం కాదు .. మీ సంస్థలను మీరు నడుపుకోవచ్చని ప్రకటించారు. కొంచెం ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లు కనిపించినప్పటికీ .. ఎయిడెడ్ కళాశాలలకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికే ‘ఆపరేషన్ – ఎయిడెడ్’ మిషన్ చేయాల్సిన నష్టాన్ని చేసేసింది. ఇదిలా ఉంటే సంస్థలను నిలబెట్టుకునేందుకు ప్రైవేటు అధ్యాపకులను నియమించుకుని, ఆ భారాన్ని ఫీజులరూపంలో విద్యార్థులపై వేయాలని భావిస్తున్నాయి ఎయిడెడ్ విద్యాలయాలు. దీంతో ప్రభుత్వ అనాలోచిత చర్యకు ఎయిడెడ్ ఆలోచనాత్మక వ్యూహాల చట్రంలో పేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాలు నలిగిపోయితున్నాయి. ప్రజాసేవ కోసం పుట్టికొచ్చిన రాజకీయపార్టీలు .. నేడు కులాలు, మతాలు, వివక్షలు, కక్ష్యసాధింపు ధోరణిలో ముందుకు సాగుతున్న వేళా .. అప్పుల కూపంలో, తాకట్టు టక్కుటమార నిర్ణయాలకు తమ సంస్థలను బలిపెట్టబోమని ఎయిడెడ్ విద్యాలయాల ట్రస్టీల మాట. నమ్మకం, విశ్వసనీయతకు అర్థాలు వేరులే అన్న సూక్తిని ప్రజలతోపాటు వ్యవస్థలు గమనిస్తునే ఉన్నాయని ఎయిడెడ్ విలీన ప్రక్రియపై మేథావుల అభిప్రాయాలు వినవస్తున్నాయి.











