రక్తపు మరకలను టీడీపీకి అంటిచాలని చూశారు..
బాబాయిని చంపిన అబ్బాయి.. ఆ రక్త మరకల్ని తెలుగు దేశం పార్టీకి అంటించాలని చూశారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్టల్లో ధ్వజమెత్తారు. వివేకా హత్య కేసు విచారణను సీబీఐ వేగవంత చేస్తుంటే.. అసలు వాస్తవాలు వెలుగుచూస్తున్నాయని చెప్పుకొచ్చారు. వివేకా హత్య వైఎస్ ఇంటి గొడ్డలిపోటుతోనే జరిగిందని సీబీఐ తేల్చిందని ఆరోపించారు. ఈ ‘జగనాసుర రక్త చరిత్ర’ను ఇప్పుడు సాక్షిలో రాయించాలని ట్వీట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు లోకేశ్. అలానే వివేకా హత్యకు సంబంధించి ఎంపీ అవినాష్ మాట్లాడిన వీడియోలను లోకేశ్ తన ట్విట్టర్ కు జత చేశారు.
Muist Read:-నారా లోకేశ్ స్పీచ్ ఊర మాస్











