దేశ లౌకిక వాదాన్ని కాపాడదాం!
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. అలానే దేశంలోని లౌకికవాద శక్తులన్నింటిని ఒకతాటిపైకి తీసుకొచ్చేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలకు దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది! ఈ నేపథ్యంలో మంగళవారం మాజీ ప్రధాని, జనతాదళ్ జాతీయ అధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడ.. సీఎం కేసీఆర్ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కేసీఆర్ కు ఫోన్ చేసి తన మద్దతును ప్రకటించారు. దేశంలోని లౌకిక వాదులకు మద్దతుగా, మత తత్వానికి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని గుర్తు చేస్తూ.. అభినందించారు. దేశ వ్యాప్తంగా పెచ్చురిల్లుతున్న మత తత్వ ధ్రోరణిని కట్టడిచేస్తేనే సమరస్యతను నెలకొల్పడం సాధ్యమౌతుందని హెచ్డీ దేవెగౌడ్ ఉద్ఘాటించారు.
మీ యుద్ధానికి మా మద్దతు..
మోదీ ప్రభుత్వంపై కేసీఆర్ సాగిస్తున్న యుద్ధానికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని చెప్పారు దేవెగౌడ్! మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని కేసీఆర్ కు తెలిపారు. తాను త్వరలోనే బెంగళూరు వచ్చి సమావేశమవుతానని దేవెగౌడకు సీఎం కేసీఆర్ కు వివరించారు. మరో వైపు కేసీఆర్ కు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఫోన్ చేసి మాట్లాడారు. భాజాపా, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నయ కూటమిగా ఏర్పడి దేశ సమాఖ్యను కాపాడాలని సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఇదే అంశాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలీన్ తో కూడా మాట్లాడానని స్వయంగా మమతా వెల్లడించారు. మొత్తానికి దేశంలో భాజాపా, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయాలని మమత బలంగా ప్రయత్నిస్తున్నారు.
Must Read:-రాజ్యాంగం వర్సెస్ ప్రజాస్వామ్యం! కేసీఆర్, తమిళిసై మధ్య విబేధాలకు కారణాలివేనా!!