రాజ్యసభ టికెట్ కన్ఫామ్?
సీఎం జగన్ ను సినీ నటుడు, వైసీపీ నాయకులు అలీ భేటీ అయ్యారు. భేటీ ముగిసిన తరువాత అనంతరం మీడియాతో మాట్లాడారు. అలీకి రాజ్యసభ టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది దీనిపై మీ కామెంట్ ఏమిటని మీడియా ప్రతినిధులు అడగగా.. సమాధానం చెప్పేందుకు నిరాకరించాడు. రాజ్యసభ సీటు ఇస్తారనే విషయం తనకు తెలియదని, అలాంటి సంకేతాలు ఏవీ సీఎం ఇవ్వలేదని చెప్పారు. అతి త్వరలో పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన ఉంటుందని పేర్కొన్నారు. మర్యాద పూర్వకంగానే సీఎంను కలిశానన్నారు. వైఎస్ఆర్ సీఎం కాకముందు నుంచే వారి కుటుంబంతో పరిచయం ఉందని, పదవి ఇస్తేనే పార్టీలోకి వచ్చి సేవ చేస్తానని నేనుప్పుడు అనుకొను అని స్పష్టత నిచ్చాడు అలీ. ఏమీ అశించకుండానే పార్టీలోకి వచ్చానని ఆయన చెప్పారు. నిన్న సీఎంవో నుంచి పిలుపు వస్తేనే సీఎంను కలిసేందుకు కుటుంబ సమేతంగా వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు. త్వరలో పార్టీ ఆఫీస్ నుంచి ప్రకటన వస్తుందని తెలిపారు. మరో రెండు వారాల్లోనే మంచి శుభవార్త వింటారని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే మరోవైపు రాజ్యసభ సీటు అలీకే ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.











