యువ కథానాయకుడు, కొత్త పెళ్లికొడుకు ‘నితిన్’, మహానటి ‘కీర్తి సురేష్’ లు మొదటిసారిగా నటిస్తున్న ‘రంగ్ దే’ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. కరోనా రాకుంటే ఈ సినిమా ఈపాటికే విడుదలై ఉండేది. ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ కు కరోనా కారణంగా అంతరాయం కలిగింది. దాన్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నారు. ‘తొలిప్రేమ’,’మజ్ను’ వంటి ప్రేమ కథాచిత్రాలను వెండితెరపై వైవిధ్యంగా ఆవిష్కరించిన యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
పి.డి.వి.ప్రసాద్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. చాలా రోజుల విరామం తర్వాత ఈ సినిమా షూటింగును హైదరాబాద్ లో ప్రారంభించారు. కరోనాకు సంబంధించిన అన్ని జాగ్రత్తలనూ తీసుకున్నారు. నితిన్ తో పాటు ఈ సినిమాలోని ప్రధాన తారాగణమంతా ఈరోజు షూటింగులో పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, పాటలచిత్రీకరణతో త్వరగానే ఈ సినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదలవుతుంది.
ప్రముఖ ఛాయాగ్రాహకుడు పి.సి. శ్రీరామ్ గారు ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్. దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఇంకా సీనియర్ నటుడు నరేష్, వినీత్,రోహిణి, కౌసల్య,బ్రహ్మాజీ,వెన్నెల కిషోర్, సత్యం రాజేష్,అభినవ్ గోమటం,సుహాస్, గాయత్రి రఘురామ్ తదితరులు నటిస్తున్నారు. దీనికి డి.ఓ.పి.: పి.సి.శ్రీరామ్; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్; కూర్పు: నవీన్ నూలి: కళ: అవినాష్ కొల్లా. అడిషనల్ స్క్రీన్ ప్లే : సతీష్ చంద్ర పాశం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం(వెంకట్)











