దేనికైనా టైమ్ రావాలి మరి. పవర్ స్టార్ బ్రో సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్ర జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బండ్ల గణేష్ వెళ్లబోతున్నాడంటూ నిన్న వార్తలు హల్ చల్ చేశాయి.
త్రివిక్రమ్ తో అతనికి పడదు కదా ఒకే వేదికను ఎలా పంచుకుంటారో అన్న ఆసక్తి అందరిలోనూ కలిగింది. తీరా ఫంక్షన్ జరిగింది. మాటల మాంత్రికుడు అక్కడ మాయమయ్యాడు. ఆ మాంత్రికుడిపై మాటల తూటాలు వదిలే బండ్ల గణేష్ కూడా ఆ ఛాయల్లో కనిపించలేదు. ఆయన కనిపించలేదు గానీ ఆయన మాటలు మాత్రం వైరల్ అయ్యాయి. తనకు ఆహ్వానం అందలేదని బండ్ల గణేష్ అన్నారు. అయినా పవర్ స్టార్ అభిమానులు తాను ఆ వేదక మీదకు రావాలని పిలిచే అక్కడ ప్రత్యక్ష్ మవుతానని బండ్ల అన్నారు కూడా.
బండ్ల మాట అటుంచితే ఆ వేదిక మీద ఎక్కడా త్రివిక్రమ్ జాడలేదు. ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాయడమే కాదు స్క్రీన్ ప్లే కూడా సమకూర్చారు. దాదాపు 15 కోట్ల రెమ్యూనరేషన్ ఆయనకు ముట్టినట్టు వార్తలొచ్చాయి. గుంటూరు కారం షూటింగులో బిజీగా ఉండి ఆయన రాలేదా? మరే కారణం ఏదైనానా అన్న సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. తాను ఆ ఫంక్షన్ కు వస్తానని త్రివిక్రమ్ మాట ఇచ్చినట్టు చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాకు బజ్ తేవాల్సిన బాధ్యత కూడా త్రివిక్రమ్ మీద వుంది.
అందువల్ల ఆయన కచ్చితంగా హాజరవుతారనే అందరూ అనుకున్నారు. జీవితం.. టైమ్.. ఫిలాసఫీ.. కుటుంబ విలువలు.. ఇవన్నీ కలగలిసిన కథాంశంతో బ్రో తెరకెక్కరింది. ఇలాంటి సినిమాని మాటలతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయాల్సిందే.అందుకే ఇందులో త్రివిక్రమ్ హస్తం పడింది. తమిళ వెర్షన్ కు దర్శకత్వం వహించిన సముద్రఖని దీనికి కూడా దర్శకత్వం వహించినా పవర్ స్టార్ ఉండటం వల్ల మరిన్ని మార్పులు చేసి తెరకెక్కించారు. ఇక ఈ వేదికపై పవన్ భక్తుడు బండ్ల గణేష్ వస్తున్నాడంటూ నిన్నంతా వార్తలు చక్కర్లు కొట్టాయి.
పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ మాటల గారడీ చేసే బండ్ల వస్తాడని పవర్ స్టార్ అభిమానులు అనుకున్నారు. కమెడియన్‌గా, నిర్మాతగా టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ తన మాటలు చేష్టలతో కూడా అంతే గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ట్వట్టర్ నుంచి ఆయన తన అస్త్రశస్త్రాలను సంధిస్తుంటారు. త్రివిక్రమ్ తో ఎక్కడ చెడిందో తెలియదుగానీ ఆయనను గురుజీ అని సంబోధిస్తూ బాణాలు ఎక్కుపెడుతుంటారు. గతంలో ఓ నెటిజన్ ‘బండ్లన్నా నాకు ప్రొడ్యూసర్ అవ్వాలని ఉంది’ అని ట్వీట్ చేస్తే దీనికి బండ్ల ఇచ్చిన జవాబు అప్పట్లో హాట్ టాపిక్‌అయ్యింది.
‘గురూజీని కలవండి. ఖరీదైన బహుమతులు ఇవ్వండి. అప్పుడు మీరు అనుకున్నది జరుగుతుంది’ అన్నది ఆయన రిప్లై. మరో నెటిజన్ ‘గురూజీకి కథ చెబితే దానికి తగిన విధంగా స్క్రీన్‌ప్లే రాసి అసలు కథను షెడ్‌కు పంపిస్తాడన్నటాక్ ఉంది. నిజమేనా? అని ప్రశ్నిస్తే దీనికి కూడా బండ్ల తనదైన శైలిలో స్పందించాడు. .‘అదేం కాదు భార్యాభర్తల్ని, తండ్రీ కొడుకుల్ని, గురుశిష్యుల్ని.. ఎవర్నైనా వేరు చేస్తారు’ అంటూ జవాబిచ్చాడు. ఈ ట్వీట్లు అన్నీ త్రివిక్రమ్ ను ఉద్ధేశించే అనే విషయాన్ని తెలుసుకోలేని వారేంకాదు నెటిజన్లు. ఇక తాజా విషయానికి వస్తే బండ్ల గణేష్ వస్తున్నాడని తెలిసి త్రివిక్రమ్ ఈ వేడుకకు గైర్హాజరయ్యారన్న వదంతులు కూడా వ్యాపించాయి. నిజానిజాలేంటో కాలమే నిర్ణయించాలి.