ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలో పేరుగాంచిన పుణ్యక్షేత్రాల్లో కాణిపాకం ఒకటి. మూడు రోజుల నుంచి ఏసీబీ, కాణిపాకం ఆలయంలో సోదాలు నిర్వహిస్తోంది. ఆలయ ఆదాయం, జమ, ఖర్చుల లెక్కలు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు. వరసిద్ధి వినాయకుడిగా భక్తుల చేత పూజలందుకుంటున్న స్వామికి సంబంధించిన ఆదాయాల్లో కొన్ని అవకతవకలు జరిగినట్లుగా ఆరోపణలు రావడంతో ఏసీబీ గత మూడు రోజులుగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
టికెట్ కౌంటర్, డొనేషన్ కౌంటర్, ఆర్జిత సేవల టికెట్లు.. ఇలా ఆలయానికి సంబంధించిన ఆదాయ, ఖర్చులకు సంబంధించిన ప్రతి వివరాలని ఏసీబీ నిశితంగా పరిశీలిస్తుంది. ఆలయ చరిత్రలో ఇలాంటి ఆదాయ సోదాలు మొదటి సారిగా జరగడం గమనార్హం.