కరోనా వైరస్ బలహీన పడిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తమిళ హీరో సూర్యకు కరోనా పాజిటివ్ నిర్దారణ కావడం కలకలం రేపుతోంది. ఇటీవల కాలంలో కరోనా కేసులు బాగా తగ్గిపోయాయి. హీరోలంతా సినిమా షూటింగుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఈ తరుణంలో సూర్య ట్విట్టర్ ద్వారా తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రకటించారు. ప్రస్తుతం సూర్య పాండిరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో సూర్య సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది.
ఇంతకు ముందు నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో సూర్యకు మంచి హిట్ కూడా వచ్చింది. షూటింగుల్లో పాల్గొంటున్న సూర్య కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ గా నిర్దారణ కాగానే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘నాకు కరోనా పాజిటివ్. ప్రస్తుతానికి బాగానే ఉన్నా. మన జీవితాలు ఇంకా మామూలు స్థితికి రాలేదన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. అలాగే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి’ అని సూర్య పేర్కొన్నారు.
సూర్య త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు. సూర్య కు కరోనా అని తెలిసిన వెంటనే ఇతర హీరోలు, నటులు కూడా స్పందించారు. సూర్య త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. సూర్యకు కరోనా అని తెలియగానే చాలా సినిమాల్లో షూటింగుల్లో ఉన్న నటులంతా అప్రమత్తమయ్యారు. షూటింగుల్లో కూడా జాగ్రత్తలు ఎక్కువయ్యాయి.
Also Read: పల్లెటూరి బుల్లోడుగా సూర్య