హెడ్డింగ్ చూసి ఇదేదో రియల్ లైఫ్ వ్యవహారం అనుకోకండి. రీల్ లైఫ్ లోనే. రాజశేఖర్ కూతుళ్ళు శివానీ, శివాత్మిక రెండు వేరు వేరు సినిమాల్లో ఓ యంగ్ హీరో సరసన కథానాయికలు గా నటిస్తున్నారు. అతడి పేరు అదిత్ అరుణ్. ‘బొమ్మరిల్లు’ గాళ్ జెనీలియా నటించిన ‘కథ’ సినిమాతో అతడు టాలీవుడ్ లో హీరోగా రంగప్రవేశం చేశాడు. ఆ తర్వాత ‘వీకెండ్ లవ్, తుంగభద్ర, మనసుకు నచ్చింది, 24 కిస్సెస్’ అనే మూవీస్ లో నటించాడు. అయితే రాజశేఖర్ ‘గరుడవేగ’ మూవీతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘చీకటిగదిలో చితక్కొట్టుడు’ అనే సినిమాలో నటించాడు. అడల్డ్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాకి డబ్బులు బాగానే వచ్చాయి.
ఇప్పుడు అదిత్ అరుణ్ రెండు వరుస సినిమాల్లో శివానీతోనూ, శివాత్మిక తోనూ హీరోగా నటిస్తూండడం ఆసక్తి రేపుతోంది. శివాత్మిక కథానాయికగా ఈ హీరో ‘విధివిలాసం’ అనే మూవీలో నటిస్తున్నాడు. అలాగే.. శివానీ కథానాయికగా ‘ఫైర్ వాల్’ అనే మరో మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో శివాత్మిక లాస్ట్ ఇయర్ దేవరకొండ ఆనంద్ సరసన కథానాయికగా ‘దొరసాని’ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అయితే శివానీ కూడా అడివి శేష్ హీరోగా ‘2 స్టేస్ట్స్’ అనే మూవీతో కథానాయికగా తన డెబ్యూ మూవీని ప్రారంభించింది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మరి అదిత్ అరుణ్ ఆ ఇద్దరితోనూ ఏ మేరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.











