సౌత్ లేడీ సూపర్ స్టార్ గా అభివర్ణించే నయనతార.. ప్రేమిస్తున్నానని మాస్ హీరోల వెంట పడుతూ.. వారితో డ్యూయెట్స్ పాడే పాత్రలకు ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టేసింది. అసలామె ఆ స్టేజ్ ను ఎప్పుడో దాటేసింది. ఎంత పెద్ద హీరో సరసన నటించే ఛాన్సొచ్చినా సరే.. తన పాత్ర .. అందులోని వైవిధ్యత, దాని ప్రాముఖ్యత తెలుసుకొని.. అందులో సమ్ థింగ్ స్పెషల్ అనేది ఉంటేనే ఆ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అది సూపర్ స్టార్ తోనా, మెగాస్టార్ తోనా అనే విషయాలు సెకండరీ అంటోంది.
ఆ స్థాయిలో తన క్రేజ్ ను పెంచుకొన్న నయన్స్ .. ఇప్పుడు పారితోషికం విషయంలోనూ చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. నిన్నమొన్నటి వరకూ సౌత్ హీరోయిన్స్ కోటి నుంచి కోటిన్నర వరకూ అందుకోవడమే చాలా గొప్ప. బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రం దాదాపు పది కోట్ల వరకూ పారితోషికం అందుకుంటున్నారు. అయితే ఇప్పుడు మన సౌత్ భామలు కూడా ఆ దరిదాపుల్లోకి వచ్చేశారు. అలాంటి వారిలో నయనతార ముందు వరుసలో ఉంటోంది. ఇప్పుడు వారితో సరిసమానంగా పారితోషికం అందుకోడానికి నయన్ ఆరాటపడుతోంది.
ప్రస్తుతం నయనతార మార్కెట్ రూ.30 కోట్లనుంచి రూ. 40 కోట్ల వరకూ పెరిగింది. అందుకే అమ్మడు తన పారితోషికం రూ. 10కోట్లు వరకూ డిమాండ్ చేస్తోంది. పదికి ఒక్క పైసా కూడా తగ్గకుండా.. పారితోషికం ఇమ్మని దర్శక, నిర్మాతల్ని అడుగుతోందట. నిన్న మొన్నటివరకూ ఆమె రూ. 5కోట్ల వరకూ పారితోషికం అందుకుంది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కు ఖచ్చితంగా పది ఇవ్వాల్సిందే అని పట్టుబడుతోందట. సౌత్ హీరోయిన్స్ పది కోట్లు పారితోషికం ఏంటా అని మేకర్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి నయనతారా మజాకా.
Must Read ;- ఫస్ట్ డోస్ వేక్సిన్ తీసుకున్న కోలీవుడ్ ప్రేమ పక్షులు











