‘రాజా ది గ్రేట్’ తర్వాత మాస్ మహారాజా రవితేజ ట్రాక్ రికార్డు ఏమంత బాగోలేదు. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ పరాజయం పాలయినప్పటికీ రవితేజ తదుపరి సినిమాల లైనప్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. ఎర్లియర్ గా డిస్కోరాజా తో కొత్త గా ట్రై చేయాలనుకున్నాడు. కానీ వర్కవుట్ కాలేదు. అందుకే తన ఇమేజ్ కు రొటీన్ ఊరమాస్ సినిమాలే బెస్ట్ అనుకున్నాడు. ఆ క్రమంలో ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ మూవీలో నటించాడు. ఇటీవలే సినిమా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. ఇందులో రవితేజ పోలీస్ గా తనదైన ట్రేడ్ మార్క్ స్టైల్ తో విరుచుకుపడబోతున్నాడు.
ఆ తర్వాత వీర ఫేమ్ రమేశ్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తమిళంలో అరవింద స్వామి, త్రిష జంటగా నటించిన ఇంకా విడుదల కాని సినిమా ‘చతురంగ వేట్టై 2’ కి ఫ్రీమేక్ వెర్షన్ అనే వార్తలొస్తున్నాయి. ఇందు లో రవితేజ సరసన డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి అనే కొత్త ముద్దుగుమ్మలు కథానాయికలుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి సంబంధించి మరో ముఖ్యమైన విశేషం ఏంటంటే.. రంగమ్మత్త అనసూయ ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. నెగెటివ్ షేడ్స్ తో ఉన్న సినిమాని మలుపుతిప్పే కేరక్టర్ అని తెలుస్తోంది.
‘క్షణం’లో అనసూయ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ పాత్ర అనసూయకి మంచి పేరు తెచ్చిపెట్టింది. కథలో అదో కీలకమైన పాత్ర కూడా. సరిగ్గా ‘ఖిలాడీ’ లో కూడా అనసూయ స్ర్కీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తుందని అంటున్నారు. ‘రాక్షసుడు’ సినిమాతో దర్శకుడు గా మంచి పేరు తెచ్చుకున్న రమేశ్ వర్మ ఈ సినిమాతో కూడా సక్సెస్ అందుకుంటాడని చెప్పుకుంటున్నారు. మరి ఈ సినిమాకి అనసూయ పాత్ర ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి.